Monday, May 6, 2024

ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభం..

తప్పక చదవండి
  • ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్
    సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కనున్న సినిమా..

హైదరాబాద్ : తిరువీర్, ఫరియా అబ్దుల్లా, కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా నిర్మితమవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త రవి పనస నిర్మాత. ఈ చిత్రంతో గోపి.జి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25వ తేదీ నుండి మొదలవనుంది. అత్యున్నత సాంకేతికి విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు తెరపై ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుందని, ఆడియెన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

నటీనటులు : తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు
టెక్నికల్ టీమ్ : సినిమాటోగ్రఫీ – రాజ్ తోట.. మ్యూజిక్ – కె.పి.. ప్రొడక్షన్ డిజైనర్ – గాంధీ.. ఎడిటర్ – ప్రవీణ్ పూడి.. పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా.. సమర్పణ – ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్.. బ్యానర్ – రవి పనస ఫిలిం కార్పొరేషన్
నిర్మాత – రవి పనస.. రచన, దర్శకత్వం – గోపి.జి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు