Sunday, May 19, 2024

తప్పుడు సమాచారం ఇస్తే.. మీ పదవికే ముప్పు

తప్పక చదవండి
  • అభ్యర్థులు ఎన్నికల నియమాలని పాటించాలి..
  • తమ అఫిడవిట్లో ఆస్తులు, నేరచరిత్ర ప్రకటించాల్సిందే.!
  • ఆస్తులు, అప్పుల వివరాలు ఫారం 26 లో వెల్లడిరచాలని చట్టం చెబుతోంది
  • తేడా వస్తే.. నేతలపై అనర్హత వేటు వేయడానికి పదునైన అస్త్రం
  • నాయకా.. ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు..

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థి వారి జీవిత భాగస్వామి మరియు వారిపై ఆధారపడినవారు ఆదాయ వనరులను అధికారికంగా ప్రకటించవలసి ఉంటుంది. నామినేషన్‌ పత్రాన్ని దాఖలు చేసే సమయంలో అభ్యర్థి తనకు, తన జీవిత భాగస్వామికి మరియు ముగ్గురు ఆధారపడిన వారికి సంబంధించిన ఆస్తులు మరియు అప్పుల వివరాలను ఫారమ్‌ 26లో వెల్లడిరచాలని ప్రస్తుతం చట్టం చెబుతోంది.
రాజకీయ నాయకుల మధ్య సత్ప్రవర్తనను నిర్ధారించే లక్ష్యంతో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమకు, వారి జీవిత భాగస్వాములు మరియు వారిపై ఆధారపడిన వారి ఆదాయ వనరులను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు దేశంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. శాసనసభ్యులు మరియు వారి సహచరులు ఆస్తులను బినామీల పేరున కూడబెట్టే ధోరణి పోవాలని, విఫలమవుతున్న ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం భావిస్తోంది. అలాగే అభ్యర్థులు తమ కుటుంబ సభ్యుల ఆస్తి, లేదా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటాను కూడా వెల్లడిరచాలని నాడు జస్టిస్‌ చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. నామినేషన్‌ ఫారమ్‌లో మార్పులు చేయాలని సంబంధిత ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం, ఇటువంటి ప్రజా సమాచారాన్ని బహిర్గతం చేయకపోవడం కూడ చట్టం ప్రకారం అవినీతికి పాల్పడినట్లుగా పరిగణించబడుతుందని పేర్కొంటూ, మరియు చట్టసభ సభ్యుల అనర్హతకు ఇది కారణం అవుతుందని తన తీర్పులో స్పష్టం చేయడం జరిగింది.
తప్పుడు సమాచారం ఇస్తే.. మీ పదవికే ఎసరు తప్పదు..!
శాసనసభ్యులు లేదా వారి సహచరుల ఆస్తులను వారి సంబంధిత ఆదాయానికి సంబంధించిన వనరులు అసమానంగా పెరగడం, అతి తక్కువ సమయంలోనే వీరంతా కోట్లకు పడగలెత్తడం రాజ్యాంగపరంగా అనుమతించబడని ప్రవర్తనే అవుతోందని, చివరికి అవినీతి నిరోధక చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని కోర్టు పేర్కొంది. నేతలపై అనర్హత వేటు వేయడానికి ఇదొక వేదిక కావాలని న్యాయస్థానం అభిప్రాయపడిరది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ అఫిడవిట్లో అప్పుడు సమాచారాన్ని చూపించినట్లయితే భవిష్యత్తులో వారి పదవికే ఎసరు వచ్చే విధంగా ఫారం 26వ నిబంధన సూచిస్తోంది.
2018లో లక్నోకు చెందిన ఎన్‌జీఓ, లోక్‌ ప్రహరీ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ( పిల్‌)పై సుప్రీం కోర్టులో ఈ తీర్పు వెలువడిరది. ఈ తీర్పు ఐదు రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. శాసనసభ్యుల సంపద డేటాను సేకరించి, అదంతా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచడానికి శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు తీర్పును అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి..
ఎన్నికల్లో పోటీ చేసే వారి పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంలో ఈ ప్రయత్నాన్ని దేశ అజానికం స్వాగతిస్తోంది. ఇలాంటి చర్యలు మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. అభ్యర్థుల విద్యా, ఆర్థిక నేపథ్యాన్ని అఫిడవిట్ల ద్వారా వెల్లడిరచడం అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. ఆదాయ మూలాన్ని బహిర్గతం చేయడం పట్ల చాలా మంది పార్టీ ప్రతినిధులు సంతోషంగా లేరని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
నాయకా..! ఆదమరిస్తే అంతే సంగతి.!!
ఎన్నికల్లో గెలిచిన నాయకుల ఆస్తులు అనేక రెట్లు పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఇవి ఎలా సృష్టించబడ్డాయి అనే దానిపై వివరణ లేదు. అలాగే, వారి కాలమ్‌లో చాలా మంది అభ్యర్థులు తమ వృత్తి కోసం ఉద్దేశించిన వారి ఉద్యోగాల గురించి నిర్దిష్ట వివరాలను ఇవ్వకుండా, సామాజిక కార్యాచరణను రాస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం ఎలక్షన్‌ మిషన్‌ ను ప్రజల ప్రతినిధులుగా భావించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారు తమ ఆదాయాలు, ఆస్తులు మరియు అప్పుల గురించి స్పష్టమైన వివరాలు కచ్చితంగా పేర్కొన వల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా తెలియజేస్తోంది. నాయకా..! ఆదమరిస్తే అంతే సంగతి.!!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు