Tuesday, April 30, 2024

దేవుడి మాన్యం భూమిలో చెట్లు మాయం

తప్పక చదవండి
  • ఓ బడా నాయకుని అండతో దేవుడికే శఠగోపం
  • అనుమతులు లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా చెట్ల ఆమ్మివేత

దేవాలయ నిర్వహణ , ఆలయ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన వ్యక్తులే దేవుని మాన్యంపై కన్ను వేసి అక్రమ సంపాదనకు తెరలేపిన సంఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో చోటుచేసు కుంది… స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. దుద్దెడ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం నిర్వహణ కోసం గ్రామం లోని సర్వే నెంబర్‌ 105 లో 1ఎకరం 35 గుంటలు, 111 నెంబర్‌ లో 31గుంటలు కలిపి మొత్తం 2 ఎకరాల 26 గుంటల దేవుడి మాన్యం భూమి ఉంది. దీనిని గ్రామానికి చెందిన పిట్టల కృష్ణ అనే వ్యక్తి కౌలుకు చేస్తూ ఆలయానికి కౌలు చెల్లిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ భూమిలో చెట్లు పెరగడంతో వాటిపైన గ్రామానికి చెందిన ఓ బడా నాయకుని కన్నుపడిరది. ఎవరికీ తెలియ కుం డా దేవుడి మాన్యంలోని చెట్లను అమ్ము కుని సొమ్ము చేసుకోవచ్చని ఎవరూ అడగరని పథకం వేసి దేవుడు మాన్యం భూమిలో వ్యవసాయం చేస్తున్న కృష్ణ అనే వ్యక్తి సహకా రంతో అక్రమంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సోమవారం చెట్లను నరికించి వేశాడు. ఈ విషయం గ్రామంలో తెలిసి పలువురు చెట్లను ఎందుకు నరికివేసారంటూ అడగగా మంచాల శ్రీనివాస్‌ చెట్లను నరికి వేయమన్నాడని, ఆయన చెప్తేనే చేశానని కౌలుదారు సమాధానం ఇచ్చాడు. పలువురు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ సురేష్‌ , రెవిన్యూ ఇన్స్‌ స్పెక్టర్‌ బాలకిషన్‌ సంఘటన స్థలానికి చేరుకొని దేవుడి మన్యం భూమిలో అక్రమంగా చెట్లను నరికి వేసిన విషయాన్ని నిర్ధారించారు. చెట్లను నరికి వేసిన వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయమై చెట్లను నరికి వేయమని ఆదేశించిన మంచాల శ్రీనివా సును వివరణ కోరగా చెట్లు నరికి వేసిన విషయం తనకు తెలియదనీ అన్నారు. ఇదిలా ఉంటే దేవుడు సొమ్మునే కాజేయాలని చూసిన వ్యక్తులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే విచారణ జరిపి చెట్ల నరికివేతకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు