Sunday, June 23, 2024

జిల్లా రిజిస్టార్, సబ్ రిజిస్టార్ లపై కేసు నమోదు

తప్పక చదవండి
  • రిజిస్ట్రేషన్ శాఖ పై విచారణ చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
  • ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికారులారా తస్మాత్ జాగ్రత్త
  • ఆదాబ్ కథనాలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు
  • కూకట్ పల్లి రిజిస్టార్ అవినీతిపై ఆదాబ్ వరుస కథనాలు

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆదాబ్ పత్రికలో వస్తున్న కథనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా జిల్లా రిజిస్టార్ సబ్ రిజిస్టార్ లపై కేసులు నమోదయ్యాయ్యా. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా రిజిస్టార్లు సబ్ రిస్టార్లు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సీనియర్ జూనియర్ అధికారులు. ఇలా కొంతమంది అవినీతి అధికారులు చేస్తున్న అక్రమాలపై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. రంగారెడ్డి జిల్లా రిజిస్టార్ కూకట్ పల్లి ఏరియా తో పాటు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లకు బాధ్యుడు జిల్లా రిజిస్టార్ స్థిత ప్రజ్ఞ నీ కారణమని బాధితులు బహిరంగ గానే మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ అమీర్పేట్ కు చెందిన కొడాలి రవికుమార్ తండ్రి దివంగత నరసింహారావు ఆయన తన తండ్రి మరణానంతరం ఆయన గదిలో 1983 కు చెందిన రెండు ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరకడంతో వాటిని సంబంధిత సరూర్నగర్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ లో సంప్రదించగా దీనిపై హయత్ నగర్ సబ్ రిజిస్టార్ లో చూడాలని వారు సలహా ఇవ్వడంతో సదరు బాధితుడు హయత్ నగర్ సబ్ రిజిస్టార్ ని సంప్రదించగా ఆయన జిల్లా రిజిస్టార్ స్థిత ప్రజ్ఞ తో కుమ్మక్కై చెల్లుబాటు కానీ ఎన్ ఓ సి ఇవ్వడంతో బాధితుడు ఎన్ ఓ సి తీసుకెళ్లి సరూర్నగర్ సబ్ రిజిస్టార్ లో సంప్రదించగా ఇది ఫేక్ ఎన్ఓసి అని దీనిని మేము ధ్రువీకరించలేమని ఇది రిటైర్డ్ అధికారి ఇచ్చినట్లు ఫోర్జరీ చేశారని సదరు ఎన్ఓసిని మా ఆఫీస్ నందు ఆమోదించలేమని తెలపడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆధారాలు పరిశీలించిన పోలీసులు జిల్లా రిజిస్టార్ స్థితప్రజ్ఞ, హయత్ నగర్ సబ్ రిజిస్టార్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ విష్ణువర్ధన్ రెడ్డి లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలి

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా రిజిస్టార్లు, సబ్ రిజిస్టార్లు అందులో పని చేసే ఔట్సోర్సింగ్ సిబ్బందిని విచారణ చేస్తే మరెన్నో అవినీతి అక్రమాలు బయటపడతాయని ప్రజలు కోరుతున్నారు. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఏజెంట్లుగా మారి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా కూడా ఏదో ఒక కొర్రి పెట్టి డబ్బులు గుంజుతారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న తంతే మనకెందుకులే బాధ్యతలు పోనీలే 2 వేలు మూడు వేలు కదా అని సర్దుకుపోయి పనులు చేయించుకుంటున్నారు. కానీ వారికి మాత్రం దోచుకోవడంలో ఎలాంటి కనికరం చూపడం లేదు. బడుగు బలైన వర్గాల ప్రజలు ఎన్నో ఆపసోపాలు పడి వారు అడిగిన అన్ని డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు. వీటిపై ఎన్నో ఫిర్యాదులు ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వీరి అరాచకాలు మితిమీరి పోయాయి. ఇప్పటికైనా వీటిపై విచారణ జరిపి కొంత మంది లంచ గొండి అధికారుల అంతు చూడాలని ప్రజలు కోరుతున్నారు.

అవినీతి అధికారుల మూలాన ప్రభుత్వ ఖజానాకు భారీ గండి

అవినీతి అధికారుల మూలాన ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బు బ్రోకర్ల చేతుల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. కానీ కొంతమంది అధికారులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం డబ్బు సంపాదన ధ్యేయంగా దానిద్వారా ప్రభుత్వ ఆదాయం రాకుండా పోతుంది. కార్యాలయానికి వచ్చే ప్రజలను రకరకాలుగా ఇబ్బంది పెట్టి వసూలు చేస్తారు. ప్రభుత్వానికి టాక్సీ కట్టాలని చెప్పి అక్కడ మిగిలే డబ్బులను కొంతమంది అవినీతి అధికారులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై కూడా పూర్తిస్థాయి విచారణ చేయాలని వీటిని అరికడితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది అని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖల్లో జరుగుతున్న అవినీతి అక్రమాల వెలికి తీయడమే ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక కర్తవ్యం. మా అక్షరం అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు