Tuesday, April 30, 2024

పేదవారి భూమిపై కన్నేసిన రియల్‌ వ్యాపారులు

తప్పక చదవండి
  • ధరణి లోసుగులను అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న భూభకాసురులు..
  • భూమి ఒక దగ్గర.. రిజిస్ట్రేషన్‌ మరో దగ్గర..
  • లేని భూమిపై పత్రాలు సృష్టించి పేదవారిని ఇబ్బందులకు గురి చేస్తున్న రియల్‌ మాఫియా..
  • ఇదేమని అడిగితే కేసులు పెడుతున్న వైనం..
  • కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో బయటపడిన భూ అక్రమణ కేసు…

రియల్‌ ఎస్టేట్‌ పుణ్యమా అని భూముల ధరలకు రెక్కలొచ్చి కోట్లల్లో పలుకుతున్నాయి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కు దగ్గరున్న భూములకైతే ఈ తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించిన కబ్జా చేసేస్తున్నారు. ఇక భూముల విషయం చెప్పాల్సిన అవసరం లేదు అవతలివాడు కొంచెం మెత్తగా కనిపించాడంటే చాలు వారిని అమాంతం మింగేస్తున్నారు ఇలాంటి ఘటనే షాద్‌ నగర్‌ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో చోటుచేసుకుంది సర్వే నెంబర్‌ 399 లో గల చాకలి బాలయ్య అనే రైతు 1972లో సాదా బైనామా ప్రకారం సాతం లక్ష్మయ్య అనే రైతు వద్ద 5 ఎకరాల 37 గుంటల పొలం కొనుగోలు చేశాడు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబమే ఈ భూమిని సాగు చేస్తున్నారు ఆర్థిక సమస్యల కారణంగా నాలుగు ఎకరాల భూమిని ఒక వెంచర్‌ కు అమ్మడం జరిగింది మిగిలిన 1 ఎకర37 గుంటల పొలం సాగు చేసుకుంటూ ఉన్నాడు. అప్పటివరకు బాగానే ఉంది ఏ సమస్య లేదు కానీ ధరణి పొరపాట్ల కారణంగా 2019లో అప్పటి రెవెన్యూ అధికారులు బాలయ్య పట్టాదారు పాసుపుస్తకం లో ఒక్క ఎకరా 37 గుంటలకు గాను ఎకరా భూమినే నమోదు చేసి మిగిలిన 37 గుంటల పొలాన్ని నమోదు చేయలేదు అయితే ఇది తెలుసుకున్న బాలయ్య 2020 లో సవరణకుగాను కోర్టు డిగ్రీ ప్రకారం కలెక్టర్‌ కు అర్జీ పెట్టుకున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది 2022 సం లో పెంజర్ల గ్రామానికి చెందిన కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు చాకలి బాలయ్య పక్కన ఉన్న పొలాన్ని కొనుగోలు చేశారు. ఏ వ్యక్తి అయినా పొలాన్ని కొనేటప్పుడు సర్వేయర్‌ తో సర్వే చేయించుకుని పొలం హద్దు బందులను నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటాడు కానీ ఆ రియల్‌ వ్యాపారులు మాత్రం ఎలాంటి హద్దు బంధువులు లేకుండా ప్రభుత్వ సర్వేయర్‌ తో భూమిని కొలిపించుకోకుండా. పొజిషన్లో లేని భూమిని ఆదరబాదరాగా కొనుగోలు చేశారని . వాళ్లు కొన్న భూమికి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న భూమికి ఎలాంటి పొంతన లేకుండా ఉందని ఇదే అదునుగా భావించిన రియల్‌ వ్యాపారులు చాకలి బాలయ్య కు చెందిన రెవెన్యూ రికార్డులు పొలం తక్కువగా ఉందని భావించి బాలయ్య పొలంలో కంచవేశారని ఇదేమని ప్రశ్నించిన బాలయ్యను బెదిరింపులకు గురి చేశారని ఎన్నిసార్లు గ్రామంలో పంచాయతీలు పెట్టిన పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించిన రియల్‌ వ్యాపారులు మాత్రం అడపాదడపా కంచే వేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారని వీరితో విసిగి వేసారిన బాలయ్య 2023 డిసెంబర్‌ 18న కొత్తూరు పోలీస్‌ స్టేషన్లో కంప్లైంట్‌ చేయడం జరిగిందని . అప్పటి సీఐ శంకరయ్య విచారణ చేసి ఎవరి పొలాన్ని వాళ్ళు సర్వేయర్‌ తో సర్వే చేయించుకొని ఎవరి భూమిలో వారే సాగు చేసుకోవాలని ఒకవేళ సమస్య సామరస్యంగా పరిష్కారం జరగకపోతే కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే 2024 ప్రభుత్వం మారడం కొత్తూరు పోలీస్‌ స్టేషన్‌ కు నూతన సిఐ రావడం జరిగింది ఇదే అదునుగా భావించిన రియల్‌ వ్యాపారులు ఈ నెల ఫిబ్రవరి16 న బాలయ్య పొలంలో కంచే వేశారని అది చూసిన బాలయ్య మళ్ళీ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడని కానీ అక్కడ ఉన్న సిఐ ఫిర్యాదు తీసుకోలేదని చేసేదేమీ లేక బాలయ్య వెనుతిరిగాడు. అయితే ఫిబ్రవరి 22వ తారీఖున బాలయ్య పొలంలో వేసిన కంచె ఎవరో నాశనం చేశారని రాళ్లు విరగ కొట్టారని దానికి అంతటికి చాకలి బాలయ్యే కారణంగా చూపుతూ ఆయనపై కేసు నమోదు చేశారు అయితే ఈనెల ఫిబ్రవరి 17వ తారీఖున తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు నా కంప్లైంట్‌ ఎందుకు తీసుకోని వారిపై చట్టపరమైన చర్య తీసుకోలేదు కానీ ఎవరో చేసిన పనికి నాపై కేసు బుక్‌ చేయడం ఎంతవరకు సమంజసం అని అంటున్నాడు ఇతరుల పొలంలోకి వచ్చి కంచ వేయడం కూడా తప్పే కదా అని ఈ విషయంలో పోలీస్‌ స్టేషన్లో నాకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు