Monday, May 6, 2024

అర్హతలు లేకపోయినా పాఠశాలలకు అనుమతులు ఇస్తాం..

తప్పక చదవండి
  • కాస్త పలుకుబడి ఉంటే చాలు..
  • ఇంట్లో అయినా ఇస్తాం.. వంటింట్లో అయినా ఇస్తాం..
  • అకాడమీ పేరుతో పాఠశాల నిర్వహణకు అనుమతిస్తాం
  • కానీ మాకంటూ ఒక ఫీజు ఉంటది అది చెల్లిస్తే సరిపోతుంది..
  • డీఈవోలు, ఎంఈఓల పైన ఏసీబీ దాడులు నిర్వహించాలి..
  • సీ.జే.ఎస్‌ అధ్యక్షులు మాసారం ప్రేమ్‌ కుమార్‌ డిమాండ్‌..

హైదరాబాద్‌ : పాఠశాల విద్యాశాఖ విభాగం రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ పైన ఏసీబీ దాడులు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్‌ నగర్‌ ప్రాంతానికి సంబంధించిన ఓ ప్రైవేట్‌ పాఠశాల అనుమతి కోసం 80 వేల రూపాయలు డిమాండ్‌ చేయడంతో, ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే, ఏడి పూర్ణచంద్ర రావు, ఆర్జేడి పి.ఏ. సతీష్‌, సూపరిండెంట్‌ జగ్జీవన్‌ అరెస్టు అయ్యి జైల్లో ఉన్నారు. రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి పాత్రపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీబీ అధికారులు గత సంవత్సరం నుంచి పాఠశాలలకు ఇచ్చినటువంటి ఎన్‌ఓసీలపైన విచారణ చేపట్టి, ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాలను కదిపితే డొంక మొత్తం బయటికి వస్తుంది..

కిందిస్థాయి ఎంఈఓలు, డీఈవోల ఆఫీసులలో కూడా రైడ్స్‌ జరగాలి. రంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా అకాడమీల పేరుతో శ్రీ చైతన్య, నారా యణ పాఠశాలలతో పాటు ఇషా స్కూల్‌, శ్రీ భారతి విద్యాలయ స్కూల్‌, శ్రీ మేధా స్కూల్‌, మాస్టర్‌ మైండ్‌ స్కూల్స్‌ యదేచ్చగా నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఇలా నిర్వహణ కొనసాగిం చాలంటే కచ్చితంగా ఎంఈఓ ఆశీస్సులు, డీఈఓ సపోర్ట్‌ ఖచ్చి తంగా ఉండాల్సిందే.. ఈ పాఠశాలలపైన ఫిర్యాదు చేసి కూడా మూడు నెలలు అవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన ట్టుగా ప్రవర్తిస్తున్నారు. అధికారుల అండదండలు లేకుండా ప్రైవేట్‌ పాఠశాలల నిర్వహణ కొనసాగించడం దుర్లభం.. ఏసీబీ దాడులలో ఒక్క రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫీసును టార్గెట్‌ చేయకుండా, మూడు జిల్లాల్లోని డీఈవోలు, ఎంఈఓలపైన దాడులు నిర్వహిస్తే..వ్యవస్థలోని లోపాలు అన్ని తేటతెల్ల మవు తాయి.

- Advertisement -

మేడ్చల్‌ జిల్లాలో శ్రీ చైతన్య పాఠశాల పైన మూడు నెలల క్రితం ఫిర్యాదు చేస్తే.. జిల్లా విద్యాశాఖ అధికారి ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు..? జిల్లా విద్యాశాఖ అధికారి, రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అయిన విజయ లక్ష్మికే తెలియాలి.హైదరాబాద్‌ జిల్లాలోని తార్నాక ప్రాంతంలో ఖమ్మం శ్రీ చైతన్య పాఠశాలపైన మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేస్తే.. ఇంకా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. బండ్లగూడ, వనస్థలిపురంలోని నారాయణ పాఠశాలు, శ్రీ చైతన్య పాఠశాలలు, ఎల్బీనగర్‌, మణికొండ, మాదాపూర్‌ లో సిఓ ప్రోగ్రాం పేరుతో తరగతులు నిర్వహిస్తుంటే.. రంగారెడ్డి జిల్లా అధికారి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.. ఎందుకంటే ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకుని యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కయి ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలల పైన క్రైస్తవ జన సమితి గతంలో అనేక ఫిర్యాదులు చేసినా అధికారులు బాధ్యతా రాహి త్యంగా విధులు నిర్వహిస్తుం డటం శోచనీయం.. ఇప్పటికైనా సంబంధిత అధికారుల తీరుపై ప్రభుత్వము చర్యలు చేపట్టాలని, నిబద్ధతగల అధికారులను నియమించాలని, క్రైస్తవ జన సమితి అధ్యక్షులు మాసారం ప్రేమ్‌ కుమార్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు