Sunday, December 3, 2023

సీసీ రోడ్డుపై మురుగుతో అవస్థలు…!

తప్పక చదవండి
  • నెలలు గడుస్తున్నా తీరని మురుగు సమస్య
  • సీజనల్‌ వ్యాధులతో విషజ్వరాల వ్యాప్తి
  • నిమ్మకు నీరెత్తినట్లున్న మున్సిపల్‌ అధికారులు…!

జల్‌పల్లి : జల్‌ పల్లి పురపాలక సంఘం 24వ వార్డులో కొత్తగా వేసిన సీసీ రోడ్డుపై మురుగు నీరు ఏరులై పారుతుంది. నెలలు గడుస్తున్నా తీరని మురుగు సమస్యతో అక్కడి దుకాణదారులతో పాటు నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గ్రామపంచాయతీ రోజుల్లో వేసిన ఎనిమిది ఇంచుల అంతర్గత పైప్‌ ల్కెన్‌ లతో చేపట్టిన నిర్మాణ మురికి కాలువలు ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల 24వార్డులోని షాహీన్‌ నగర్‌ లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న మార్కస్‌ రహదారిపై మురికినీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుంది.దింతో పాటు మురుగు నీరు రోడ్లపైకి ఇండ్ల మధ్యలో వర్షాకాలంలో మరింతగా ఉధృతంగా ఉంటుంది. ప్రస్తుతం డెంగ్యు, మలేరియా లాంటి విషజ్వరాలు, సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న స్థానిక కౌన్సిలర్‌, మున్సిపల్‌ అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం ఇక్కడి నివాసితులు మురుగు సమస్యతో ప్రార్థనలు చేయడానికి మస్జీద్‌ కు వెళ్లలేక పోతున్నామని స్వయంగా జల్‌ పల్లి పురపాలక సంఘం కమిషనర్‌ ఎన్‌, వసంత రెడ్డికి వివరిస్తూ సంబంధిత అధికారులతో మురుగు సమస్య పరిస్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది, దానికి కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తని మున్సిపల్‌ అధికారులు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు