Wednesday, May 15, 2024

మంచి వ్యక్తిని చూసి ఓటేయండి

తప్పక చదవండి
  • మన తలరాతను మార్చేది ఓటు
  • ప్రలోభాలకు లొంగితే నష్టపోయేది మనమే
  • బీఆర్‌ఎస్‌ మాత్రమే ప్రజలకు మంచి చేసేది
  • నిరంతర కరెంట్‌ ఇస్తున్నది కూడా తెలంగాణలోనే
  • అసెంబ్లీకి పంపించేది నేతాలా.. ప్రజలా..?
  • 24 గంటల కరెంట్‌.. కావాలా.. వద్దా?
  • ధరణితో రైతుల భూములు భద్రం
  • తెలంగాణాలో దళితబంధును తెచ్చింది నేనే
  • దేశంలో ఎక్కడైనా దళితబంధు ఇస్తున్నారా?
  • ఇల్లందు సభలో సీఎం కేసీఆర్‌ పిలుపు

దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ దేశంలో.. కేసీఆర్‌ అనేటోడు రాకముందు దళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? దళితబంధు పెట్టమని ఎవరన్నా అడిగారా..? ఎవడన్న ఈ మొగోళ్లు ధర్నా చేసిండ్రా.. దరఖాస్తు పెట్టిండ్రా.. మరి ఎవడు పెట్టిండు. ఎందుకు పెట్టాము. దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి..

  • సీఎం కేసీఆర్‌

ఖమ్మం : ఎన్నికల్లో ఓటును అలవోకగా వేయొద్దు.. మీ తలరాత మార్చేది.. భవిష్యత్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఒక ఒరవడిలో కొట్టుకు పోకుండా, పైసలకు, ప్రలోభాలకు ఓటు వేయొద్దు. మీరు ఆలోచించి చైతన్యంతో నిజమేదో ఆలోచించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే స్థితి రానంత వరకు ఈ దేశం ఇలానే ఉంటదని కేసీఆర్‌ అన్నారు.ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఇల్లందు చాలా ఉద్యమాలు జరిగిన ప్రాంతం.. చాలా చైతన్యం ఉండే ప్రాంతం.. పోరాటాల పురిటిగడ్డ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీకి ఒకరు నిలబడుతారు. బీఆర్‌ఎస్‌ తరపున హరిప్రియ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ తరపున ఎవరో ఒకరు నిలబడుతారు. నవంబర్‌ 30న ఎన్నికలు జరిగేది ఖాయం.. డిసెంబర్‌ 3న ఎవరో ఒకరు గెలిచేది ఖాయం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గుడస్తుంది. రాజకీయ పరిణితి, ప్రజాస్వామి పరిణితి రావాల్సిన అసవరం ఉంది. ఇది గంభీరమైన సమస్య. మీ శక్తి లేకపోతే మేం చేసేది ఏం లేదు..మీలో ఒకడిగా, కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా చెబుతున్నాను.. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ ఏదీ..? చరిత్ర ఏందీ..? దృక్పథం ఏంది..? ప్రజల గురించి ఏం ఆలోచిస్తుంది ఆ పార్టీ అని తెలుసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడతుంది. మంచి ప్రభుత్వం గెలిస్తే మంచి పనులు జరుగుతాయి. చెడు ప్రభుత్వం గెలిస్తే చెడ్డ పనులు జరుగుతాయి. కాంగ్రెస్‌, టీడీపీ పాలన చరిత్ర మీకు తెలుసు. అందరి చరిత్రలు మీ చేతిలో ఉన్నాయి. వ్యవహారశైలి, నడకలు, వారు అవలంభించిన పద్దతులు మీ ముందున్నాయి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. స్థిరంగా ఆలోచించాలి. ఏం చేస్తే లాభం జరుగుతదో ఆ దారి పట్టాలి. అదే ప్రజాస్వామ్యానికి దారి. ఓటును అలవోకగా వేయొద్దు. తమాషా కోసం వేయొద్దు. కారణం ఏందంటే ఈ దేశంలో ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. మీ తలరాత మార్చేది.. భవిష్యత్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే. హైదరాబాద్‌లో మేం పని చేస్తున్నామంటే అది మీరు ధారపోసిన శక్తే. మీ శక్తి లేకపోతే మేం చేసేది ఏం లేదు. ఓటు వేసే ముందు నిజమైన పంథా ఎంచుకోవాలి అని కేసీఆర్‌ సూచించారు. అందుకే మన అమూల్యమైన ఓటు సన్నాసికి వేస్తున్నామా..? సరైన వ్యక్తికి వేస్తున్నామా..? అని ఆలోచన చేయకపసోతే మనమే ఓడిపోతాం అని కేసీఆర్‌ అన్నారు. మన బతుకులను ఎవరు మార్చలేరు. ఈ విషయాలను మీరు ఆలోచన చేయాలి. బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరిగాయి మీకు తెలుసు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పది.. చేసింది వంద. దళితబంధు పెట్టమని ఎవరూ చెప్పలేదు. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామని ఎలక్షన్‌ మేనిఫెస్టోలో చెప్పలేదు. రైతుబంధు, రైతుబీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు.. కానీ చేసుకుంటూ పోయాం అని కేసీఆర్‌ పేర్కొన్నారు.ఇల్లందులో చాలా ఉద్యమాలు జరిగాయి.. పోరాటాల పురిటిగడ్డ ఇదని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలో 24 గంటల కరెంట్‌ ఇచ్చే ఒకే రాష్ట్రం తెలంగాణ. మేనిఫెస్టోలో మేము పెట్టింది పది.. కానీ అమలు చేసింది వంద. దళితబంధు, రైతుబంధు మేనిఫెస్టోలో పెట్టలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నారు.. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని చెప్పాం. రూ.25 వేల కోట్లు నష్టమొచ్చినా భరిస్తామని చెప్పాం. ఏ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరిగిందనేది ఆలోచించాలి. కొంతమందికి డబ్బులు వచ్చాక అహంకారం పెరిగింది. అసెంబ్లీ తొక్కనీయమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అసెంబ్లీకి పంపించేది మీరా… వాళ్లా?. రైతుబంధు దుబారా అంటున్నారు.. రైతుబంధు ఉండాలా వద్దా? రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌… కావాలా.. వద్దా? ధరణి పోర్టల్‌తో మన భూములు భద్రంగా ఉన్నాయి. గిరిజనులకు పెద్ద ఎత్తున పోడుభూముల పట్టాలు ఇచ్చాం. ఒక్క ఇల్లందులోనే 48 వేల ఎకరాలకు పట్టాలు అందించాం అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఏపీ వాళ్లు చీకట్లో ఉన్నారు.. మన దగ్గర వెలుగు ఉందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ, తెలంగాణ రోడ్లను పరిశీలించాలి. డబుల్‌ రోడ్‌ వస్తే మనది.. సింగిల్‌ రోడ్‌ వస్తే వాళ్లది. దళితుల శ్రేయస్సు గురించి ఎవరూ ఆలోచించలేదు. ఎందుకీ వివక్ష.. ఎందుకు వాళ్లపై దాడులు?. హుజూరాబాద్‌లో 100శాతం దళితబంధు అమలు చేశాం. ఆరునూరైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది.. బీఆర్‌ఎస్‌ పార్టీయే. ఖమ్మం జిల్లాకు చెందిన నేత అహంకారంతో మాట్లాడుతున్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టని ఎన్నో పథకాలు అమలు చేశాం. తెలంగాణ ఇస్తే.. ఎలా బతుకుతారని ఏపీ నేతలు మాట్లాడారు. తెలంగాణ కటిక చీకటి అవుతుందని ఆనాటి సీఎం కిరణ్‌ అన్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు