Tuesday, May 7, 2024

అంతరంగంలో సుడిగుండాలు

తప్పక చదవండి

కృతజ్ఞత లేని మనుషులు, అవకాశవాదులు, నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తిత్వం లేని మనుషుల మధ్య నిజమైన మానవత్వం నీరి గారి పోతున్నది. మంచితనం మరుగున పడిపోతున్నది. నిండు కుండ లాంటి వ్యక్తిత్వాలు రంగులు మార్చే లోకంలో ఇమడలేకపో తున్నాయి. కృతఘ్నుల చేతిలో వంచనకు గురైన మంచి మనస్త త్వాలు దహించుకు పోతున్నాయి.మారు మాట్లాడకుండా మౌన ముద్ర వహిస్తున్నాయి.మోసాలకు, ద్రోహాలకు తల్లడిల్లి తట్టుకోలేక తనువు చాలిస్తున్న వారి చరిత్ర సైతం కఠిన కర్కశ పాషాణ సదృశ హృదయాల్లో ఇసుమంత చలనం కలిగించడం లేదు.కరెన్సీ కట్టల మధ్య పవళిస్తూ కాఠిన్యత ప్రదర్శించే ఆధునిక ప్రపంచపు అవలక్ష ణాలు మానవత్వానికి చితి పేరుస్తున్నాయి. ఈ ప్రపంచంలో అన్నీ ఉండి ప్రశాంతత కరువైన వారు కొందరైతే, ఏమీలేక బ్రతుకు నావను నట్టేట ముంచేస్తున్న వారు మరికొందరు తారస పడుతు న్నారు. అనునిత్యం ప్రతి ప్రతీ ఒక్కరూ ఏదో ఒక మానసిక సంఘర్షణతో వేధించ బడుతున్నారు.మనసును పట్టి పీడిస్తున్న తీవ్రమైన సంఘర్షణలు నిండు నూరేళ్ళ ఆయుస్సును బలవంతం గా ఆర్పేస్తున్నాయి. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు- వేధింపులు తట్టుకోలేక ఉరికొయ్యలకు అంకితమవుతున్న విలువైన ప్రాణాలు, ప్రేమల పేరుతో జరుగుతున్న వంచనకు ఫలితంగా జరుగుతున్న బలవన్మరణాలు- విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి, డబ్బు దొరక్క ఊపిరి తీసుకుంటున్న పరిస్థి తులు… ఇలా ఒకటేమిటి ఎన్నో..మరెన్నో వర్తమానంలో చోటు చేసుకుంటున్న విపరీతమైన పరిణామాలు అత్యంత హృదయ విదారకంగా ఉంటున్నాయి. కాలం తీరకుండా కాటికి పోయే పరిస్థితులు దాపురించడం వలనో, ఇతరుల వలన భరింపశక్యం కాని మనో క్లేశాలు సంభవించడం వలనో, జీవించడానికున్న అన్ని మార్గాలు మూతబడి,ఎలాంటి సహాయం అందని అత్యంత దయనీ యమైన పరిస్థితులు ఏర్పడడం వలనో, క్షణికావేశం వలనో అర్థాంతరంగా తుది శ్వాస విడిచే తీవ్రమైన మానసిక రుగ్మతను క్లుప్తంగా ‘‘ఆత్మహత్య’’ అని నిర్వచించవచ్చు.ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి.జీవితమంటే సుఖ దుఃఖాల సమ్మేళనం. కష్టాలు,కన్నీళ్లు, మన వెంటే నీడలా అనుసరిస్తాయి. ఆనందం, విషాదం అన్నీ మన శరీరంలో ప్రాణ మున్నంత వరకే.మనమున్నంత వరకే ఈ ఆవేదనలు, ఆక్రంద నలు. ప్రాణం పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ అంతు బట్టని వింత రహస్యం.మన శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినంత వరకే మన వీరత్వం. ఒక్కసారి మన ఆరోగ్యం దెబ్బతిని, మంచా నికి పరిమితమైన నాడు అప్పటి వరకు మనం అనుభవించిన భోగభాగ్యాలు కల మాదిరిగా కనుమరుగు కాక తప్పవు. బ్రతికున్నంత కాలం ఈర్ష్యా ద్వేషాలతో, ధనమదంతో, అహంకా రంతో, ఆధిక్యతా భావజాలంతో విర్రవీగిన గొంతులన్నీ మూగ బోక తప్పవు.చేసిన మోసాలకు, ఘోరాలకు,తప్పిదాలకు ప్రాయ శ్చిత్తం చెల్లించక తప్పదు. ఆకాశ హర్మ్యాల్లో విహరించినా, పట్టు పరుపులపై పవళించినా, పూరి గుడిసెలో,నేలపై పవళిం చినా, గంజి త్రాగి జీవించినా, పంచభక్ష్య పరమాన్నాలు భుజించి నా, నోట్ల కట్టల మధ్య,బంగారు ఆభరణాల మధ్య ఆడంబరంగా, దర్పంగా జీవించినా చివరకు మిగిలేది శూన్యం. ఎలా పుట్టామో అలాగే కన్ను మూయక తప్పదు. బ్రతికున్నంత వరకు మన సంప దను చూసి,కాకుల్లా మూగిన వారంతా శవం పక్కన క్షణమైనా నిలవజాలరు. మన జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచించు కోవాలి. ఎందుకు జన్మించామో,ఆ జన్మకు సార్ధకత ఎలా సమకూ రుతుందో ఒక్కసారి ఆలోచించు కోవాలి. విజ్ఞానం పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి. విలాసవంత మైన జీవితం మానవ జీవితాలను మలుపు తిప్పింది. వైద్య సదు పాయాలు పెరిగాయి. సగటుమానవ ఆయుః ప్రమాణం పెరిగిం దని భ్రమిస్తున్నాం. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాం అనే భ్రమలో మనమున్నాం. కాని విలాసాలతో పాటుగా వికటించిన ఆరోగ్యం గురించి మరచి పోతున్నాం. భోగాలు రోగాలను తెచ్చి పెడుతున్నాయి. రోగాలకు సగటు జీవుల జీవితాలు తలక్రిందులై పోతున్నాయి. విలాస వంతమైన జీవితం గడుపుతూ,తమ కలిమిని చూసుకుని బలిమిగా భావించి మిడిసిపాటు పడుతూ, అదే జీవితమని భ్రమించడం తాత్కాలికం.పలు రోగాలతో ప్రతినిత్యం చస్తూ బ్రతుకుతూ, బ్రతుకు జీవుడా అనుకుంటూ జీవశ్చవాల్లా బ్రతుకీడ్చడం కంటే నరకం మరొకటుండదు. ప్రతినిత్యం బ్రతుకు కోసం పోరాటమే. ఏదో సాధించాలని ఆరాటమే. తినడానికి తిండిలేక ఆకలితో అలమటించే జనం కొందరు,అన్నీ ఉన్నా తినలేని అసహాయ పరిస్థితుల్లో మరికొందరు. ఎన్ని పోరాటాలు చేసినా, తల్లక్రిం దులుగా తపస్సు చేసినా 50 ఏళ్ళకంటే ఎక్కువగా జీవించలేని దుస్థితి ఏర్పడిరది.అంతకంటే పైబడి జీవించినా అనారోగ్య పీడితు లుగా కాలం వెళ్ళ బుచ్చాలి. ఆరోగ్యం కోసం ఎంత తపించినా కాలుష్యం మధ్య జీవించడం,కల్తీ పదార్ధాలు భుజించడం వంటి పలు కారణాల వలన మానవ ఆయుః ప్రమాణం హారతి కర్పూరంలా హరించుకు పోతున్నది.ఈ మాత్రం జీవితానికి ఇతరులను వేధించుకు తినడం ఎందుకు? పీడిరచు కుతిని, జీవించడమెందుకు? గాలిలో దీపాల్లా ఎప్పుడు ఆరి పోతాయో తెలియని భద్రత లేని బ్రతుకుల కోసం ఇంతటి స్వార్ధం ఎందుకు? డబ్బు సంపాదన పేరుతో ఇతరుల పొట్టకొట్టడం దేనికి? అహంకారంతో విర్రవిగి, అసూయతో చెలరేగి ఇతరుల జీవితాలను శాసించి,వారి స్వేచ్ఛను హరించి,మనో వేదనకు గురి చేసి, ఆత్మహత్యల వైపు పురి గొల్పడం దేనికి సంకేతం? మనిషిలో మానవత్వం నశించి పోవడం వలన, మంచి చెడుల మధ్య విచక్షణ గుర్తించక పోవడం వలన ఎన్నో జీవితాలు బలై పోతు న్నాయి. సమాజంలో చోటు చేసుకుంటున్న పలు కారణాలు, కుటుంబ సమస్యలు,ఆర్థిక,ఆరోగ్య సమస్యలు,ఇతరులు పెట్టే క్షోభ ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడే వారిని పిరికి వారిగా భావించడం, బ్రతికుండగా ఆదుకోలేని వారు చనిపోయిన తర్వాత కూడా కారణాలు తెలుసుకోకుండా, నిందలు వేయడం భావ్యం కాదు. చిన్న గాయం తగిలితేనే బాధపడే వారు, ఎలాగైనా బ్రతకడానికి నిరంతరం పోరాటం చేసే వారు,ఎన్నో సమస్యల సుడిగుండాలను దాటుకుంటూ,కష్టాలను అనుభవించిన వారు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? ఏ హృదయం లో ఎలాంటి బడబాగ్ని జ్వాలలు పెల్లుబికుతున్నాయో, ఎవరి స్వా ర్ధం కన్నీళ్లు పెట్టిస్తున్నదో, ఎవరి హింసవేదనగా మారి మనసును అల్లకల్లోలం చేస్తున్నదో ఎవరికి తెలుసు? ధనవంతులు కావచ్చు పేదవారు కావచ్చు,జీవితంలో మనశ్శాంతి కరువై,తీవ్ర మనో వేదనకు గురై, అర్థాంతర మరణాలకు చోటివ్వడం చూస్తున్నాం.

  • సుంకవల్లి సత్తిరాజు 9704903463
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు