Wednesday, September 11, 2024
spot_img

ఎయిర్ హోస్టెస్‌ రూప‌ల్ ఓగ్రేను హత్య చేసిన విక్ర‌మ్ అత్వాల్ ఆత్మ‌హ‌త్య..

తప్పక చదవండి

ముంబై : ఎయిర్ హోస్ట్‌ గా శిక్ష‌ణ పొందుతున్న రూప‌ల్ ఓగ్రేను విక్ర‌మ్ అత్వాల్ అనే వ్య‌క్తి హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. అంధేరిలో ఉన్న ఫ్లాట్‌లో ఆమెను అత‌ను మ‌ర్డ‌ర్ చేశాడు. ఆ కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న విక్ర‌మ్‌.. తాను ఉంటున్న జైలులోనే ఉరివేసుకున్నాడు. రూపల్ ఓగ్రే ఇంట్లో నిందితుడు విక్ర‌మ్ ప‌నిమ‌నిషి చేశాడు. త‌న ప్యాంట్‌తోనే జైలు గ‌దిలో ఉరివేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. చ‌త్తీస్‌ఘ‌డ్‌కు చెందిన రూప‌ల్ త‌న అంధేరి ఫ్లాట్‌లో సెప్టెంబ‌ర్ 3వ తేదీన శ‌వ‌మై తేలింది. ఆమె గొంతు కోసి ఉంది.
ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్ సంస్థ‌లో శిక్ష‌ణ కోసం ఆమె ముంబైకి వెళ్లింది. ఏడాది కాలం నుంచి విక్ర‌మ్ అత్వాల్‌.. రూప‌ల్ ఓగ్రే ఇంట్లోనే హౌజ్‌కీపింగ్ ప‌నిచేస్తున్నాడు. ఇంటిని శుభ్రం చేస్తాన‌ని చెప్పి ప్ర‌వేశించిన అత‌ను.. ఆ త‌ర్వాత రేప్‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ రూపాల్ తీవ్రంగా పోరాడింది. బాధితురాలి గొంతు కోసిన విక్ర‌మ్ ఆమె శ‌రీరాన్ని బాత్రూమ్‌లో పడేశాడు. దుస్తులు మార్చుకుని అత‌ను అక్క‌డ నుంచి పారిపోయాడు.
సీసీటీవీ కెమెరాల‌కు ఆ నిందితుడు చిక్కాడు. మ‌ధ్యాహ్నం 11.30 నిమిషాల నుంచి 1.30 నిమిషాల వ‌ర‌కు ఓగ్రే ఫ్లాట్‌లోనే అత్వాల్ ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఓగ్రే ఎంత‌కీ ఫోన్ తీయ‌కపోవ‌డంతో.. కీమేక‌ర్ ద్వారా ఇంటి డోర్ తీశారు. ర‌క్త‌పు మ‌డుగులో ఓగ్రే శ‌రీరాన్ని గుర్తించారు. మ‌ర్డ‌ర్‌కు వాడిన క‌త్తి, నిందితుడి దుస్తుల్ని హౌజింగ్ సొసైటీ స‌మీపంలో ఉన్న పొద‌ల్లో రిక‌వ‌రీ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు