Tuesday, May 7, 2024

2014 ముందు 200 ఖర్చు పెట్టలేని మంత్రి..

తప్పక చదవండి
  • నేడు వేల కోట్లు ఎలా సంపాదించారో శ్వేత పత్రం విడుదల చేయాలి..
  • బి.ఎస్.పి. పార్టీలో చేరిన వట్టె.జానయ్య యాదవ్..
  • లక్ష ఓట్లతో జానయ్యను గెలిపించాలి : ఆర్.ఎస్.పి.
  • సంతకాలు మున్సిపల్ చైర్ పర్సన్ వి.. కమిషన్లు మంత్రికి..
  • నా బాధితులు ఎవరన్నా సూర్యాపేట వాణిజ్య భవన్ చౌరస్తాలో చర్చకు రావాలి.
  • తాజాగా సూర్యాపేట జిల్లా పి.ఎ.సి.ఎస్. కమిటీని రద్దు చేశారు.
  • సుపారి హత్యకు ప్లాన్ చేసి, నా కుటుంబమే లేకుండా చేయాలని చూశారు.
  • సూర్యాపేటలో భారీ ర్యాలీ తీసిన వట్టె జానయ్య యాదవ్..
  • జన జాతర గా మారిన పట్టణంలోని వీధులు..

సూర్యాపేట : వట్టె జానయ్య యాదవ్ ను లక్ష ఓట్ల మెజార్టీతో నియోజక వర్గ ప్రజలు గెలిపించాలని బి.ఎస్.పి. రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత 50 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వట్టె జానయ్య యాదవ్ సోమవారం సూర్యాపేటకు జిల్లా కేంద్రంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా బి.ఎస్.పి. పార్టీ ర్యాలీ కి వచ్చిన జనంతో పట్టణంలోని పలు వీధులు జనమయంగా మారాయి.. నాయకులు, బిఎస్పీ కార్యకర్తలు ఆనంద ఉత్సాహాలతో జానయ్య యాదవ్ కు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కు భారీ గజమాలతో మెడికల్ కాలేజీ వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి కోర్టు చౌరస్తా, పిఎస్ఆర్ సెంటర్, వాణిజ్య భవన్, శంకర విలాస్, ఎంజీ రోడ్డు మీదగా కొత్త బస్టాండ్ వరకు చేరింది.

విలేకరుల సమావేశంలో వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ :
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ.. 50 రోజుల పోరాటంలో మా కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. సూర్యాపేట 70ఏండ్ల చరిత్రలో ఒకే ఒక్క సారి బీసీ బిడ్డ ధర్మం బిక్షం మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. అగ్రవర్ణాల కుట్రలలో భాగంగా నియోజక వర్గంలో పోటీ చేయకుండా ఎన్నో కుట్రలు చేశారు. ఏ పార్టీ నుండి అగ్రవర్ణ నాయకులు వచ్చిన కడుపులో పెట్టుకొని గెలిపించారు. 2014 నుండి సూర్యాపేటకు సంబంధం లేని వ్యక్తి.. కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి ని గెలిపించుకున్న ఘనత సూర్యాపేటది. 2018లో ఆయన గెలుపు కోసం నేను చేసిన పాత్ర ఏందో అందరికి తెలుసు.. అర్ధరాత్రి గెలుపు కోసం కన్నీరు పెట్టుకున్న చరిత్ర ఆయనది.. బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వారికి చైర్మన్ పదవి ఇస్తామని డబ్బులు తీసుకున్నది నిజం కాదా.! నన్ను, నా భార్యను చైర్మన్ చేస్తామని డబ్బులు తీసుకున్నది నిజం కాదా.! తీసుకున్న డబ్బులకు బాధ్యత తీసుకోవాలని అడిగినందుకు నాకు ఈ రోజు ఈ గతి పట్టించి, పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది కాంట్రాక్టర్ల కడుపు కొట్టి, ఒకే వ్యక్తికి కాంట్రాక్టులు ఇచ్చి కోట్లు వెనుక వేసుకున్నది నిజం కాదా.. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు. రోడ్ల అభివృద్ధి ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని అక్రమంగా సంపాదించిన సంపాదనతోనే గెలుస్తా అని మంత్రి ధీమాగా ఉన్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజ్ మాస్టర్ ప్లాన్ మార్చి కోట్లు సంపాదించారని, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం రోడ్ల మీద వ్యాపారం చేసుకోకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

- Advertisement -

2014 ముందు 200 ఖర్చు పెట్టలేని మంత్రి :
నేడు వేల కోట్లు ఎలా సంపాదించారో శ్వేత పత్రం విడుదల చేయాలి…
2014 ముందు 200ఖర్చు పెట్టలేని మంత్రి, నేడు వేల కోట్లు ఎట్లా సంపాదించారో శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాగారం బంగ్లా చుట్టూ కబ్జా చేసిన భూములు, కలెక్టరేట్ పేరుతో పేద రైతుల నుండి భూములను గుంజుకొని భూముల రేట్లు పెంచారన్నారు. అసైన్డ్ భూములని మిషన్ భగీరథ పేరుతో పేదల భూములు గుంజుకున్నారని, వందల ఎకరాల భూములు ఉన్న ఆసాముల దగ్గర ఎందుకు భూములు గుంజుకోలేదో చెప్పాలన్నారు. ఉద్యమ సమయంలో ఉన్న నాయకులను ఇప్ఫడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం.! అని, మున్సిపల్ చైర్ పర్సన్ యిస్తా అని గండూరి ప్రకాష్ తో పాటు చాలా మందిని మోసం చేశారని గుర్తు చేశారు.

సంతకాలు మున్సిపల్ చైర్ పర్సన్ వి, కమిషన్లు మంత్రికి :
సూర్యాపేట ప్రజల ఇబ్బందులపై పిఏ లతో మాట్లాడిన రికార్డులు ఉన్నాయి.. సమయం వచ్చినప్పుడు బయట పెడుతా అన్నారు. కోటి సుఫారీ ఇచ్చిన వ్యక్తితోనే నాపై తప్పుడు కేసులు పెట్టించాడు. అధికారం దుర్వినియోగానికి పాటుపడుతున్న అధికారులను తీసి అడ్డుకట్ట వేయాలి. లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయించడానికి వెనుకాడ బోమని అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలి. బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయనే పేదలను భయభ్రాంతులకు గురి చేయడం బీఆర్ఎస్ అభ్యర్థులు మానుకోవాలన్నారు. తాజాగా తెలిసిన విషయమేంటంటే సూర్యాపేట జిల్లా పిఎసిఎస్ కమిటీని రద్దు పరిచారని తెలిసింది. ప్రజలతో ఎన్నుకోబడిన మమ్మల్ని, ఎలా మంత్రి రద్దు చేయించారో చెప్పాలన్నారు. అగ్రకుల నాయకత్వంలో పనిచేసే బహుజనులు ఇప్పటికైనా స్వతాగా బయటకు రండి బీసీల ఆత్మగౌరవాన్ని బలి చేయవద్దు.. రాబోయేది బహుజన రాజ్యమేనని గుర్తుంచుకోవాలని కోరారు. పత్రికా యాజమాన్యాలు అధికార పార్టీకి బందీలయ్యాయి. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు.. సాధారణ జర్నలిస్టుల పక్షాన యాజమాన్యాలు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడునున్న వట్టి జానయ్య యాదవును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఒకే రోజులోనే 74 కేసులు వట్టె జానయ్య యాదవ్ పై పెట్టించడంతో పాటు, ఆ కేసులను సూర్యాపేట జిల్లా కోర్టులో ఎవరు వాదించ వద్దని బార్ కౌన్సిల్ కు హుకుం జారీ చేయడం మంత్రి జగదీష్ రెడ్డి నీచ రాజకీయ చరిత్రకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ వట్టె రేణుక, ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి బుడిగ మల్లేష్ యాదవ్, కొండ భీమయ్య, చెడపంగు రవికుమార్, రాపోలు నవీన్ కుమార్, దేశగాని సాంబశివ గౌడ్, వెంపడి నాగమణి, దాసరి శీను, పెడమర్తి ఉపేందర్, చాంద్ పాషా, నీలాబాయి లింగా నాయక్, నకిరేకంటి వెంకన్న, మేడి ప్రియదర్శిని, ఆవుదొడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు