Sunday, May 19, 2024

కాంగ్రెస్‌ను అదృష్టం వరించే సమయం త్వరలోనే..

తప్పక చదవండి
  • పునర్వైభవానికి కలిసికట్టుగా ఉండాలి..
  • రేవంత్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అధికారం ఖాయం..
  • నవగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి..
  • శ్రీ రుద్రపీఠం, దేవముని దేవదైవజ్ఞ వారి విశ్లేషణాత్మక కథనం..

హైదరాబాద్‌ : ఈసారి కాంగ్రెస్‌ వారికి ఎన్నికలలో గ్రహాలు ఎంతో అనుకూలంగా వున్నాయి. ఈ సమయంలో వారు తమలో తాము పొట్లాడుకోకుండా పార్టీ విజయ మునకు కృషి చేస్తూ పునర్వైభవమును పొందున్నట్లుగా కలసికట్టుగా సంపూర్ణముగా సర్వ విధములా ప్రయత్నమును చేసిన వారిని విజయము తప్పక వరిస్తుంది.రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రి కాండిడేట్‌ గా ప్రకటించి కాంగ్రెస్‌ వారు ఎన్నికలలో ప్రచారం చేసినట్లయితే ఈసారి కాంగ్రెస్‌ వారు తప్పకుండ విజయమును సాధించగలరని, ఇతనికి ఎన్నికల సమయంలో నవగ్రహాలు అనుకూలంగా ఉన్నాయని, ఇతనికే కాకుండా ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి కూడా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయని పార్టీలోని వారు చిన్న చిన్న రెమెడీలను, విజయమును వరించడానికి చేయవలసిన యాగములను ఈ నెల రోజులు చేయించుకొనిన తప్పక విజయమును సాధించి మరల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండాను వేగిరేయగలరని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసికొని వారి వారి భవితవ్యమును నిర్ణయించుకొనగలరు.ఎవరెవరు ఏ ఏ యాగములు చేయవలెనో, ఏ ఏ సమయములు ఎవరెవరికి అనుకూలమో తెలుసుకొని తమ తమ విజయమునకు యాగములు చేసుకొనుచు, తమ ప్రత్యర్థి అపజయం పాలగునట్లు కూడా చేయవలసిన క్రియలను కూడా తప్పక చేసుకొనిన ఎంతో మేలు చేకూరుతుంది.ఇవి ఏమి చేయక కేవలం కోటానుకోట్లు గుమ్మరించి పగటి కలలు కంటూ ఉంటే సమయం చేజారిపోయి కంటతడి పెట్టు కోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. కావున ఉన్న ఈ నెల రోజులను ఎంత సద్వినియోగం చేసుకుంటే వారు వచ్చే ఐదు సంవత్సరములు రాజుల వలే అంత సుఖంగా జీవించగలుగుతారు. కావున ఈ దుస్థితిని పైసలను ఖర్చు పెట్టి కొనుక్కోకుండా, జాగ్రత పడి సమయం చేజారక ముందే జాగరుకులై జాగ్రత్త పడి విజయమును వరించి విజయులు కాగలరని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు