Monday, May 6, 2024

ఈ ఏడాది కోహ్లీ లిఖించిన రికార్డులివే..

తప్పక చదవండి

విరాట్‌ కోహ్లీ 2019, 2022 మధ్య తన బ్యాడ్‌ ఫామ్‌తో ఎంతో సతమతమయ్యాడు. తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు విరాట్‌ కోహ్లీ ప్రతి రెండో-మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసేవాడు. కానీ, ఈ మూడేళ్లలో విరాట్‌ కోహ్లీ బ్యాట్‌ నుంచి ఏ ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా రాలేదు. అయితే, తీవ్రంగా తన బ్యాడ్‌ఫాంపై శ్రమించిన కోహ్లీ, ఆ తర్వాత మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తూ.. దూసుకపోతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం విరాట్‌ కోహ్లి 2022 టీ20 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేయడం ద్వారా ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను ప్రతి ఫార్మాట్‌లో పరుగులు చేయడం కొనసాగించాడు. 2023 సంవత్సరం విరాట్‌ కోహ్లీకి చాలా గుర్తుండిపోయే సంవత్సరంగా మారింది. ఈ సంవత్సరం విరాట్‌ కోహ్లీ ప్రపంచ కప్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు, 8 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు, అత్యధిక పరుగులతో సహా అనేక ప్రత్యేక రికార్డులను సృష్టించాడు. 2023లో విరాట్‌ కోహ్లీ సాధించిన రికార్డులు.. 2048 పరుగులు చేశాడు.10 సెంచరీలు చేశాడు.8 అర్ధ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు బాదేశాడు. ఐపీఎల్‌లో 639 పరుగులు చేశాడు.ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (765) సాధించాడు. ఒకే ప్రపంచకప్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డు బద్దలు కొట్టాడు. ప్రపంచకప్‌ సెమీ-ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై వన్డే ఫార్మాట్‌లో 50వ సెంచరీ సాధించిన ప్రపంచంలోనేతొలి ఆటగాడిగా నిలిచాడు. బాక్సింగ్‌ డే టెస్ట్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేశాడు. అలాగే దక్షిణాఫ్రికాపై 2023 చివరి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి వరకు జట్టు కోసం ఒంటరిగా పోరాడాడు.2023లో 2000కు పైగా పరుగులు.. విరాట్‌ కోహ్లీ 2023లో మొత్తం 36 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ 36 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి మొత్తం 2048 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ సగటు 66.06గా ఉంది. 2023 లో విరాట్‌ కోహ్లి మొత్తం 8 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు చేశాడు.
ప్లేయర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌.. ఇది కాకుండా, ఐపీఎల్‌ 2023లో శుభ్‌మన్‌ గిల్‌ తర్వాత విరాట్‌ కోహ్లీ అత్యధికంగా 639 పరుగులు చేశాడు. ప్రపంచ కప్‌ 2023లో కూడా, విరాట్‌ కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దీంతో విరాట్‌ కోహ్లి ప్లేయర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ కప్‌ టైటిల్‌ కూడా అందుకున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు