Monday, April 29, 2024
Array

రోటరీ, వాసవి వనిత క్లబ్ సేవలు అభినందనీయం..

తప్పక చదవండి
  • కళాశాలకు 10 గ్రీన్ బోర్డుల బహుకరణ
  • వివరాలు తెలిపిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆఫ్జల్..

జనగామ :
మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకంచ, జనగామకు రోటరీ క్లబ్ అఫ్ అంకురా వరంగల్, వాసవి వనిత క్లబ్ గ్రేటర్ జనగామ అధ్యర్యంలో ప్రెసిడెంట్ ఎండీ. రఫీ, సెక్రటరీ మోహనరావు, ట్రెజరర్ శ్రీనివాస్, చార్టర్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు, శ్రీలత, తోట వైద్యనాధ్, కోటేశ్వరరావులు 5 గ్రీన్ బోర్డులను బహుమతిగా అందించారు. శరత్ లెజర్ ఐ హాస్పిటల్ డాక్టర్ శరత్ (పాస్ట్ గవర్నర్ ) వరంగల్ వారు 5 బోర్డులను అందించి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేసి విద్యార్థులకు అంకితం చేశారు. వనిత క్లబ్ గ్రేటర్ జనగామ అధ్యక్షులు డాక్టర్ వరుధిని, సెక్రటరీ అనూజా, ట్రెజరర్ నాగమణి,ఎక్సటేషన్ చైర్మన్ డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ నుండి కందికొండ రత్నకు కుట్టు మిషన్ బహుకరించడం జరిగింది. తరువాత కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆఫ్జాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారికి కృతజ్ఞతలు తెలిపి, అధ్యాపకుల చేత అభినందనలు తెలిపి, సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులు కళాశాల ప్రాంగణం లో మహాత్మా గాంధీ, సరస్వతి విగ్రహాలు, కళాశాల టాపర్స్ కి 3000 రూపాయలు, ఇంగ్లీష్ టాపర్స్ కి 1000 రూపాయలు, 90 శాతం మార్కులు పొందిన వారికీ చేతి వాచీలు, రోటరీ క్లబ్ వారు 25 మంది విద్యార్థినిలకు సైకిల్స్, మహాత్మాగాంధీ విగ్రహం గద్దె నిర్మాణం కొరకు 5116 రూపాయలు, కళాశాల సి డి సి చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు కళాశాలకు డోమెస్టిక్ వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి, విద్యార్థులు ఆడుకోవడానికి కావలసిన స్పోర్ట్స్ మెటీరియల్ ను డాక్టర్ ప్రమోద్ కుమార్ ఇచ్చేందుకు, నర్సింగ్ విద్యార్థినిలకు కావాల్సిన వైట్ డ్రెస్,మెటీరియల్ ను వైద్యనాధ్ అందించుటకు సుముఖత వ్యక్తం చేయడంతో.. కళాశాల ప్రిన్సిపాల్ ఆఫ్జాల్, అధ్యాపకుల బృందం, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. జ్యోతి ప్రజ్యాలన అనంతరం చిన్నారి రూషిక నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు పుల్లూరి శ్రీధర్, వోడపల్లి సురేందర్, యాడ మురళీధర్, కళాశాల సీనియర్ లెక్చరర్ వేముల శేఖర్, లైబ్రరీయన్ రంగన్న, కళాశాల స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, జాతీయ సేవా పథకం పోగ్రాం ఆఫీసర్ మరిపెల్ల రవిప్రసాద్, అధ్యాపక బృందం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు