Wednesday, May 15, 2024

కార్మికుల పొట్టకొడుతున్న ఆదిత్య కన్ స్ట్రక్షన్స్..

తప్పక చదవండి
  • కూలీలు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మోసం..
  • పోలీసులు, బౌన్సర్లతో బెదిరింపులు, దాడులు..
  • ఆదిత్య నిర్మాణ సంస్థ ముందు కార్మికులు, కూలీల మహా ధర్నా..
  • పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం..

హైదరాబాద్ :
నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు సాగించి, కోట్లకు పడగెలిత్తిన ఆదిత్య నిర్మాణ సంస్థ, కార్మికుల పొట్ట గొడుతోంది. నిర్మాణాలు చేపట్టిన పలు రకాల కాంట్రాక్టర్లు, కార్మికులకు చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా, బెదిరింపులు, దాడులకు పాల్పడుతుంది. పేరున్న సంస్థ కదా.. చేసిన పనులకు డబ్బులు ఎక్కడ పోతాయనే నమ్మకంతో, పనులు చేసినప్పటికీ చివరకు కార్మికులను, కాంట్రాక్టులను నిండా మోసం చేసేసింది. పనిచేయించుకుని, చేసిన పనికి డబ్బులు ఇవ్వాలని అడిగితే, ఇవ్వమంటూ బెదిరించడమే కాకుండా, బౌన్సర్లతో దాడులు కూడా చేయిస్తోందని.. ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆదిత్య నిర్మాణ సంస్థ మోసాల బాగోతంపై, కార్మికులు ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా ఆదిత్య నిర్మాణ సంస్థ వేధింపులు తాళలేక కార్మికులు చివరకు ఆందోళన బాట పట్టారు. తమకు రావలసిన బిల్లులు ఇవ్వకుండా, ప్రశ్నిస్తే తిరిగి తమపైనే దాడి చేస్తున్నారంటూ ఆదిత్య కన్స్ స్ట్రక్షన్ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. వివరాళ్లోకి వెళితే..

శేరిలింగంపల్లి మండలం, హఫీజ్ పేట్, గోకుల్ ప్లాట్స్ దగ్గర సర్వే నెంబర్ 78, 80లలో దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఆదిత్య కన్స్ స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ బహుళ అంతస్థుల నిర్మాణం కొనసాగిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ నిర్మాణంలో కూలీలు, లేబర్ కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. కానీ వారికి బిల్లులు చెల్లించకుండా ఆదిత్య నిర్మాణ సంస్థ ఇబ్బందులకు గురి చేస్తుంది, దీంతో మంగళవారం తమ బిల్లులు వెంటనే చెల్లించాలని సాయి తిరుమల కన్ స్ట్రక్షన్స్ ప్రాజెక్టు మేనేజర్ కృష్ణ.. కాంట్రాక్టర్లు, కూలీలతో కలిసి ఆదిత్య నిర్మాణాల ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసినా తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వడం లేదని, బిల్లులు ఆడిగేందుకు వచ్చిన తమపై బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులతో కలిసి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ లో సుమారు రూ.50 కోట్ల మేర పెట్టుబడులు పెట్టి నిర్మాణాలు చేపట్టామని, ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్ కొనసాగించామని తీరా కన్ స్ట్రక్షన్ పూర్తయ్యే దశకు వచ్చిన క్రమంలో తమకు బిల్లులు ఇవ్వడం లేదని, కనీసం కన్ స్ట్రక్షన్ ఏరియాలోకి కూడా అడుగు పెట్టనివ్వకుండా బౌన్సర్లతో తమపై దాడులు చేయిస్తున్నారని వాపోయారు.. అప్పులు చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టామని, నిర్మాణం పూర్తయ్యే సమయంలో తమను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఆదిత్య కన్ స్ట్రక్షన్ నిర్మాణం విషయంలో కోర్టు కేసులు ఉన్నాయన్న విషయం తమకు చెప్పలేదని, కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాక తమను ఇబ్బందులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. ఆదిత్య నిర్మాణ సంస్థ చేసిన మోసంతో ఇప్పుడు తాము కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు కూడా లేవని అన్నారు. తమకు న్యాయం చేయాలని, వీలైనంత త్వరగా తమ బిల్లులు చెల్లించకపోతే రానున్న రోజుల్లోనూ ఆందోళనలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు