- దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్
- టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా టీం
వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ తెంబ బవుమా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎంగిడి స్థానంలో షంసీ ఆడతాడని బవుమా… ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ తెంబ బవుమా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎంగిడి స్థానంలో షంసీ ఆడతాడని బవుమా చెప్పాడు. ఇక ఆసీస్ స్టోయినిస్, సియాన్ అబాట్ స్థానంలో స్మిత్, మ్యాక్స్‌వెల్‌ను తీసుకుంది.
లీగ్ దశలో ఆస్ట్రేలియాను ఓడించిన సఫారీలు సెమీస్‌లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలనే కసితో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే టైటిల్ పోరులో టీమిండియాతో తలపడుతుంది.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్, డస్సెన్, తెంబ బవుమా(కెప్టెన్ ), మార్కరమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్‌సేన్, రబాడ, కోయెట్టీ, కేశవ్ మహారాజ్, షంసీ.
ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, లబూషేన్, పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా.