Wednesday, September 11, 2024
spot_img

చైనా ఎంబసీలోకి దూసుకెళ్లిన కారు

తప్పక చదవండి

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో గల చైనా రాయబార కార్యాలయంలోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఆ కారు డ్రైవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరోవైపు.. చైనా కాన్సులేట్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండిరచింది. కాన్సులేట్‌ భవనంపైకి కారు దూసుకువచ్చిందన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయాలంటూ సూచించారు. కాన్సులేట్‌ వీసా కార్యాలయంలోని లాబీలోకి చేరుకున్న పోలీసు అధికారులు కారులోని అనుమానితుడితో సంప్రదిం పులు మొదలుపెట్టారు. ఆపై ఓ అధికారికి, డ్రైవర్‌కు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. తూటా గాయాల పాలైన నిందితుడిని కాపాడేందుకు చివరి వరకూ ప్రయత్నించినా ఆసుపత్రిలో అతను తుది శ్వాస విడిచాడని పోలీసు సార్జంట్‌ కత్రిన్‌ వింటర్స్‌ విూడియాకు తెలిపారు. ‘అమెరికా దీనిని తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టాలి. దౌత్య సిబ్బంది భద్రతకు సరైన చర్యలు తీసుకోవాలి’ అని చైనా కాన్సులేట్‌ ఓ ప్రకటనను విడుదల చేసింది. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మంగళవారం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు