Sunday, May 19, 2024

దేశంలో ఎక్కడా లేని అభివృద్ది పథకాలు

తప్పక చదవండి
  • గ్రావిూణ రోడ్ల అభివృద్దికి పెద్దపీట
  • మిషన్‌ భగీరథతో తీరిన మంచినీటి గోస
  • రోడ్లు భనవాల శాఖమంత్రి వేమలు ప్రశాంతరెడ్డి

నిజామాబాద్‌ : గ్రావిూణ రోడ్ల అభివృద్ధికి తెలంగాణ సర్కార్‌ పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర రోడ్లు భనవాల శాఖమంత్రి వేమలు ప్రశాంతరెడ్డి అన్నారు. రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యధిక నిధులతో రహదారులను నిర్మిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవు తున్నాయన్నారు. ప్రతి ఇంటికి రెండు నుంచి మూడు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నారన్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనం మిషన్‌ భగీరథ పథకమేనన్నారు. ఈ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తూ తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపారన్నారు. మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తేనే మరింత మేలు జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను సమానంగా తీసుకెళ్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం చేసి అసాధ్యాన్ని.. సుసాధ్యం చేసిన అపర భగీరథుడని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేసవి కాలం వస్తే గొంతు తడుపుకోవడానికి సైతం తీవ్ర ఇబ్బందులు పడేవారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దాహార్తిని తీర్చుకోవడానికి మహిళలు ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం చేసి మిష న్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు సరఫరా చేయిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలకు ఎలాంటి సంక్షేమ ప థకాలు అవసరమో సీఎం కేసీఆర్‌ తెలుసుకుని వారి అవసరానికి అనుగుణంగా ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు