Saturday, May 11, 2024

గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో సర్కార్ ఘోర వైఫల్యం..

తప్పక చదవండి
  • భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదు
  • రివ్యూలకే పరిమితమైన అధికార యంత్రాంగం
  • గణనాథులను నేరుగా నిమజ్జనం చేయాలంటూ బెదిరిస్తున్నారు
  • మీరు బెదిరిస్తే భయపడేవాళ్లెవరూ లేరు
  • భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోం
  • జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి
  • కరీంనగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్

( గవర్నర్ నిర్ణయం ముమ్మాటికీ కరెక్టే.. గవర్నర్ రబ్బర్ స్టాంప్ లా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు.. : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ )

హైదరాబాద్ : గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మరి కొద్ది గంటల్లో గణేష్ నిమజ్జనం జరగాల్సి ఉన్నప్పటికీ… ఇంతవరకు ఏర్పాట్లే పూర్తి చేయలేదని, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. అధికారులు వార్డుల్లోని గణేష్ ఉత్సవ కమిటీల వద్దకు వెళ్లి టవర్ సర్కిల్ కు విగ్రహాలను తీసుకురావొద్దని, నేరుగా నిమజ్జనానికి వెళ్లాలని, లేనిపక్షంలో ఇబ్బంది పడతారంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘‘ మీరు బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదు. అసలు మీరెవరు బెదిరించడానికి? అందరూ టవర్ సర్కిల్ కు వస్తారు. ఇక్కడి నుండే నిమజ్జనానికి వెళతాం…ఏం చేస్తారో చూస్తా…. మీరు కనుక మళ్లీ బెదిరిస్తే… నేనే అక్కడికి వస్తా. అక్కడే కూర్చుంటా… చూద్దాం ఏం చేస్తారో… మీరు బెదిరిస్తే పండుగలు జరుపుకునే దుస్థితిలో హిందూ సమాజం లేదు..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

- Advertisement -

మంగళవారం రోజు ఉదయం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ సహా స్థానిక కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ టవర్ సర్కిల్ వద్దకు వచ్చారు. రేపు జరగబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, కరెంట్ వైర్లు తొలగించకపోవడం, నిమజ్జన ఏర్పాట్లు చేయకపోవడాన్ని గమనించిన బండి సంజయ్ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేపు నిమజ్జనం జరగబోతుంటే ఇప్పుడు తూతూ మంత్రంగా సిమెంట్ పనులు చేస్తుండటమేంటని మండిపడ్డారు.

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇక్కడికి వచ్చాను. భక్తియుత, ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు పూర్తి కావాలి. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నగరంలోని గణనాథులంతా రేపు టవర్ సర్కిల్ కు రావాలి. వినాయక నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఇంకా కరెంట్ వైర్లు తొలగించలేదు. ఇప్పుడు సిమెంట్ పనులు మొదలు పెట్టారు. తూతూ మంత్రంగా సమీక్షలతోనే అధికారులు సరిపెట్టారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారు. పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇట్లనే ఉంటే భక్తులు ఆగ్రహావేశాలకు గురవుతారు. దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నాం. కానీ ఈ ఏడాది అధికారులు ఏర్పాట్లను ఏమాత్రం పట్టించుకోలేదు. భక్తులకు సౌకర్యాలు కల్పించలేదు. ఇష్టానుసారంగా రివ్యూలు పెడుతూ…. గణనాథులను టవర్ సర్కిల్ కు తీసుకురావొద్దు.. నేరుగా నిమజ్జనానికి తీసుకెళ్లాలంటూ అన్ని వార్డులకు పోయి అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీరు బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదు. అసలు మీరెవరు బెదిరించడానికి? అందరూ టవర్ సర్కిల్ కు వస్తారు. ఇక్కడి నుండే నిమజ్జనానికి వెళతాం… మీరు మళ్లీ బెదిరిస్తే… నేనే అక్కడికి వస్తా. నేనే కూర్చుంటా… చూద్దాం ఏం చేస్తారో… మీరు బెదిరిస్తే పండుగలు జరుపుకునే దుస్థితిలో హిందూ సమాజం లేదు.. మీ ఒంటెద్దు పోకడలను సహించబోం. మేం ఏం చేసినా ఎవరూ ఏం చేయలేరు. పైవాళ్లు కాపాడతారని అనుకుంటున్నారేమో.. మిమ్ముల్ని ఎవరూ కాపాడలేరు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళ సై తిరస్కరించడం ముమ్మాటికీ సరైన నిర్ణయమే. గవర్నర్ తన విచక్షణాధికారులను ఉపయోగించి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ రబ్బర్ స్టాంప్ గా ఉండాలనుకుంటోంది. వాళ్లు పంపిన ఫైళ్లన్నీ చూడకుండా సంతకం పెట్టాలనుకుంటోంది. గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తే ఆమెకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఇది సరి కాదు… వాళ్లకు నచ్చినట్లు లేకుండా విమర్శలు చేయడం సరికాదు అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు