- మొదటి లడ్డు రూ. 10,001.. ఈ సంవత్సరం 4 లడ్డూలు
వేలం పాటలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.. - వివరాలు తెలిపిన బీజేపీ జిల్లా మహిళ మోర్చా నేత సుజాత..
పటాన్చెరు: పటాన్చెరు పట్టణంలోని గౌతంనగర్ కాలనీలోని వినాయక మండపాల వద్ద విఘ్నశ్వర స్వామికి సోమవరం నాడు బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రదాన కార్యదర్శి కొల్లోల సుజాత, రాజు ముదిరాజ్ అద్వర్యంలో 9 రోజులు శ్రీ విఘ్నేశ్వర స్వామి కి అంగరంగా వైభవంగా లడ్డూ వేలంపాట, గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. విఘ్నశ్వర స్వామికి పూజలు తరువత వెలంపటలో నిర్వహించడం జరిగింది. మొదటి లడ్డు రూ.10,001/- కు నాగసాని జగదీష్ ముదిరాజ్ కైవాసం చేసుకోగా, గౌతంనగర్ కు చెందిన గాయత్రికి రెండో లడ్డు రూ.8,000/- , మూడోది గౌతంనగర్ కు చెందిన రాజు ముదిరాజ్ రూ. 7,800/-, నాలుగో లడ్డు పటాన్చెరు కు చెందిన వినోద్ ముదిరాజ్ రూ.4,000/- , అయిదవ లడ్డు పటాన్చెరు మార్కెట్ చెందిన రమేష్ రూ. 3,800/- వేలంపాట లో లడ్డు కైవసం చేసుకున్నారు.
తదుపరి శ్రీ విఘ్నేశ్వర స్వామి శోభాయాత్ర లో విద్యుత్ అలంకరణ నృత్యాల తో యువకులు చిన్నారులు మహిళలు బతకమ్మ పాటలతో శోభాయాత్రలో పాల్గొన్నారు.. పటాన్చెరు లోని సాయి చెరువులో శ్రీ మహా గణపయ్య నిమజ్జనం సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం సెప్టెంబర్ 26వ రోజు తల్లి గంగమ్మ తల్లి వడికి, చేర్చారు భక్తులు. ఈ ఆధ్యాత్మిక శోభాయాత్రలో శివ చిట్ల మీడియా సంచాలకులు, ఏ. రవీందర్ పోలీస్ అధికారి, సాయి ముదిరాజ్, శ్రీకాంత్, సునీత, దమ్మని రామకృష్ణ ముదిరాజ్ దంపతులు, హైదరాబాద్ యువ పెన్సిల్ ఆర్టిస్ట్ చిట్ల సోదరులు కుందన్, కార్తీక్ ముదిరాజ్, రాకేష్, శ్రావణ, మనిరాజ్ తదితరులు పాల్గొన్నారు..