Tuesday, May 14, 2024

కాంగ్రెస్‌ పాలనలో తాండూరు అధ్వాన్నం

తప్పక చదవండి
  • ఇప్పుడేమో అభివృద్దిలో ఆదర్శంగా నిలిచింది
  • 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ది శూన్యం
  • మంచినీరు, కరెంట్‌కు ఢోకా లేకుండా చేశాం
  • తాండూరు సభలో సిఎం కెసిఆర్‌ వెల్లడి

తాండూరు : కాంగ్రెస్‌ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం కాగా…ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని సిఎం కెసిఆర్‌ అన్నారు. అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపామని అన్నారు. రోడ్లు బాగు చేసుకున్నాం. చెక్‌ డ్యాంలు కట్టుకున్నాం. మైనర్‌ ఇరిగేషన్‌ కింద ఎన్నో చెరువులు మంచిగా చేసుకున్నాం. భూగర్భ జలాలు పెరిగాయి. ఇదంతా విూ కండ్ల ముందే ఉంది. నేనేక్కడిదో అమెరికా కథ చెప్పట్లేదు. విూ తాండూరు కథనే చెప్తున్నా అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని, పైలట్‌ రోహిత్‌ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఈ పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఏం జరిగింది. 50 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏం జరిగిందో పోల్చిచూడాలన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌. కనీసం మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వలేదు. తాండూరు ప్రజలు కాగ్నా నది వద్ద గుంతలు తీసి వడకట్టుకొని నీళ్లు తాగేది కాంగ్రెస్‌ రాజ్యంలో. కానీ ఈ రోజు మిషన్‌ భగీరథతో ప్రతి తండాలో, చిన్న ఊరులో కూడా పరిశుద్ధమైన నీరును సరఫరా చేస్తోంది. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్‌ పాలనలో. పదేండ్ల కాలంలో మారుమూల తండాలకు మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాం అని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంట్‌ లేదు, సాగు, మంచినీళ్లు లేవు. ప్రజలంతా బతుకపోవుడు. అర్థరాత్రి కరెంట్‌ కోసం పోయి తాండూరులో 40 మంది రైతులు షాకులతో, పాములు కరిచి చనిపోయారు. ఇవన్నీ విూరు ఆలోచించాలి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆర్థికనిపుణులతో చర్చించి ఒక లైన్‌ తీసుకున్నాం.పేదల సంక్షేమాన్ని ముందు తీసుకున్నాం. రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలు చేశాం. కంటి వెలుగు ద్వారా కండ్లద్దాలు పంపిణీ చేశారు. గర్భిణుల కోసం కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి కార్యక్రమాలు అమలు చేశాం అని కేసీఆర్‌ తెలిపారు. సంక్షేమం తర్వాత వ్యవసాయ రంగం తీసుకున్నాం. వ్యవసాయం బాగుంటే, రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటది. ప్రాజెక్టుల కింద నీళ్లు పారుతే ఇతర రాష్టాల్లో పన్నులు వసూళ్లు చేస్తరు. మేం నీటి తిరువా రద్దు చేశాం. మేలైన విద్యుత్‌ 24 గంటలు ఫ్రీ ఇస్తున్నాం. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్‌. అదృష్టం బాగాలేక రైతు ఎవరైనా చనిపోతే దినవారం లోపే 5 లక్షల బీమా ఇస్తున్నాం. 7500కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొంటున్నాం. ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ రైతులు బాగుండాలని మద్ధతు ధరకు కొంటున్నాం. ఆ డబ్బులు కూడా విూ బ్యాంకు ఖాతాలో వేస్తున్నామని కేసీఆర్‌ గుర్తు చేశారు. కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు..

తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని, పైలట్‌ రోహిత్‌ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. రైతుబంధు తప్పకుండా ఉంటది.. ఉండుడే కాదు. రేపు రోహిత్‌ రెడ్డి గెలిస్తే 10 వేలనుంచి 16 వేలకు పోతది. రోహిత్‌ గెలిస్తేనే ఉంటది. కత్తి ఒకరికి ఇచ్చియుద్ధం ఇంకొకరిని చేయమంటే ధర్మం కాదు కదా..? రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండే వారి చేతిలో కత్తి పెడితేనే వాళ్లు మిమ్మల్ని కాపాడుతారు. 24 గంటల కరెంట్‌ ఉంటది రోహిత్‌ రెడ్డి గెలిస్తేనే లేదంటే కరెంట్‌ ఆగమైపోతది. కాబట్టి విూరు రోహిత్‌కు ఓటేయాలన్నారు. ఇంకో డేంజర్‌ మాట చెబుతున్నారు కాంగ్రెసోళ్లు. వీఆర్వోల రాజ్యం, ప్రభుత్వం చేతిలో రైతుల బతుకు ఉండే. ఇప్పుడు విూ బొటనవేలు పెడితేనే భూ యజమాన్యం మారుతది. ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదు. ప్రభుత్వం విూకు ధారపోసిన ఆ అధికారాన్ని పొడగొట్టు కుంటారా..? కాపాడుకుంటారా..? అనేది విూరే నిర్ణయించుకోవాలి అని కేసీఆర్‌ సూచించారు. కాంగ్రెసోళ్లు చెప్తున్నారు అధికారంలోకి వస్తే అది వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తరట. భూమత పెడుతరట. అది భూమాతనా..? భూ మేతనా..? ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా రావాలి. ఇది తీవ్రమైన సమస్య. రైతాంగానికి జీవన్మరణ సమస్య. కాబ్టటి విూరంతా సీరియస్‌గా ఆలోచించాలి. మేం పాత పద్ధతి పెడుతామని చెప్తున్నారు. మళ్లీ పట్వారీలు, పాత కథనే వస్తది. మళ్లీ దళారి రాజ్యమే వస్తది. కాంగ్రెస్‌ అంటేనే దళారీ, పైరవీకారుల రాజ్యం. మన భూములు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతుంది. చాలా కష్టపడి ధరణి తెచ్చాం. కరెంట్‌ తెచ్చాం. అవన్నీ కూడా తీసేస్తాం అంటున్నారు. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్‌ కోరారు. తాండూరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌ రెడ్డి నిజాయితీపరుడు.. ఆయన కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్చి, ఈ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని, పైలట్‌ రోహిత్‌ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. జినుగుర్తిలో ఇండస్టీయ్రల్‌ పార్కు కావాలని, లారీలు పట్టణంలో ఎక్కడంటే నిలబడుతు న్నాయని చెప్పారు. మహేందర్‌ రెడ్డికి ధన్యవాదాలు.. ఈసారి రోహిత్‌ రెడ్డికి టికెట్‌ ఇద్దామంటే ఆయన కూడా పెద్ద మనసు చేసుకుని అంగీకరించారు. ఆయన ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి. రోహిత్‌ రెడ్డి నిజాయితీకి నిలబడ్డ మనిషి. బీజేపీ వాళ్లు వచ్చి మన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్లను పట్టించి జైల్లో వేయించారు. బ్రహ్మాండమైన పని చేసిండు. నిజాయితీకి నిలబడ్డాడు. ఆయన అడిగింది ఏది కాదనకుండా మంజూరు చేస్తున్నాను. ఆయన వ్యక్తిగతంగా ఏది అడగలేదు. తాండూరు వెనుకబడ్డ ప్రాంతం. బోర్డర్‌లో ఉండే ప్రాంతం. నాకు బాగా తెలుసు. తప్పకుండా పాలిటెక్నిక్‌ కాలేజీతో పాటు మిగతావి కూడా ఇచ్చేద్దాం. తప్పకుండా మంజూరు చేస్తాను అవేవిూ గొంతెమ్మ కోరికలు కావు. ఢల్లీి నుంచి తెచ్చేటివి కావు. హైదరాబాద్‌లో చేసే పని కాబ్టటి నూటికి నూరు శాతం నెరవేరుస్తాను అని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. తండాల్లో లంబాడీ బిడ్డలే రాజ్యమేలుతున్నారు.. బంజారా బిడ్డలు మా తండాలో మా రాజ్యం కావాలని ఏండ్లు కొట్లాడారు. ఏ గవర్నమెంట్‌ చేయలేదు. ఈ కాంగ్రెసోళ్లు కేర్‌ చేయలేదు. మేం 3,500 తండాలను గ్రామపంచాయతీలుగా చేశాం. తాండూరులో 24 గ్రామ పంచాయతీలుగా చేశాం. లంబాడీ బిడ్డలే సర్పంచ్‌లుగా ఉండి రాజ్యమేలుతున్నారు. సేవాలాల్‌ సేన వాళ్లు మద్దతు ప్రకటించారు. వాళ్లకు ధన్యవాదాలు. సేవాలాల్‌ జయంతి ఘనంగా జరుపుతున్నాం. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా జరుపుకుందాం. బంజారాహిల్స్‌లో బంజారాలు లేకుండా పోయారు సమైక్య రాష్ట్రంలో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మండంగా బంజారా భవన్‌ కట్టాం. మన రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా బంజారా భవన్‌ను ఎయిర్‌ కండీషన్‌ సదుపాయంతో కట్టాం. బంజారాల గౌరవానికి చిహ్నంగా దాన్ని నిర్మించామని కేసీఆర్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు