Sunday, April 28, 2024

స్టాక్‌ మార్కెట్‌ కొత్త రికార్డు

తప్పక చదవండి
  • సెన్సెక్స్‌ 72000 దిశగా, 21500 దాటిన నిఫ్టీ

న్యూఢిల్లీ : సెన్సెక్స్‌ మరో కొత్త చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్‌ 72000, నిఫ్టీ 21500 దాటాయి. బుధవారం సెన్సెక్స్‌ సరికొత్త ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయి 71647 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది. 21543 స్థాయిలో ప్రారంభమైంది. బుధవారం సెన్సెక్స్‌ 210 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 90 పాయింట్లు లాభపడిరది. అంతకుముందు మంగళవారం, సెన్సెక్స్‌ ఆల్‌ టైమ్‌ 71623.7కి చేరుకుంది. డిసెంబర్‌ 8వ తేదీనే 21000 పాయింట్ల స్థాయిని దాటి ప్రస్తుతం 22000 వేల దిశగా పయనిస్తోంది. ప్రస్తుత సంవత్సరంలో నిఫ్టీలో 2900 పాయింట్ల భారీ జంప్‌ కనిపించింది. డిసెంబర్‌ 30, 2022న ఇది 18,105 స్థాయిలో ఉంది.మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్‌ 71832 వద్ద సరికొత్త శిఖరాన్ని తాకింది. ఇది జరిగిన కొద్దిసేపటికే సెన్సెక్స్‌ మరో కొత్త గరిష్ట స్థాయి 71866కు చేరుకుంది. కాగా, నిఫ్టీ 21577 వద్దకు చేరుకుంది. బీఎస్‌ఈలో 2701 స్టాక్‌లు ట్రేడవుతున్నాయి. వీటిలో ఎరుపు రంగులో 527, ఆకుపచ్చ రంగులో 2096 మాత్రమే ఉన్నాయి. ఈ కాలంలో 113 స్టాక్‌లు అప్పర్‌ సర్క్యూట్‌లో, 43 లోయర్‌ సర్క్యూట్‌లో ఉన్నాయి. ఇది కాకుండా 187 స్టాక్‌లు 52 వారాల గరిష్ఠ స్థాయి వద్ద ట్రేడవుతుండగా 8 మాత్రమే కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌లో టెక్‌ మహీంద్రా 1.92 శాతం పెరిగి రూ.1306కు చేరుకుంది. ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ 1.48 శాతం పెరిగి రూ.6203.40 వద్ద ఉంది. టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌లు కూడా ఒక శాతానికిపైగా పెరిగాయి. కాగా, నిఫ్టీ టాప్‌ లూజర్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ ఉన్నాయి. మరోవైపు అదానీ గ్రూప్‌ షేర్లు కూడా పెరుగుతున్నాయి. ప్రారంభ ట్రేడిరగ్‌లో, అదానీ ఎనర్జీ సొల్యూషన్‌ 4.46 శాతం పెరిగి రూ.1124.20కి చేరుకుంది. అదానీ పవర్‌ దాదాపు 0.36 శాతం పెరిగి రూ.537.40 వద్ద ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2951.60కి చేరుకుంది. కాగా, ఈరోజు కూడా అదానీ టోటల్‌ గ్యాస్‌ 0.77 శాతం పెరిగి రూ.1034.20 వద్ద, అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.1542.90 వద్ద ఉంది. అదానీ పోర్ట్‌ కూడా 0.60 శాతం పెరిగి రూ.1080.45 వద్ద ట్రేడవుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు