Friday, May 3, 2024

మహిళల భద్రతకు ఆర్టీసీలో ప్రత్యేక చర్యలు

తప్పక చదవండి

హైదరాబాద్‌ : సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్‌ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. బస్సును ట్రాక్‌ చేసేలా ‘గమ్యం’ యాప్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీలో 8,571 బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో రెండు నెలల క్రితం 4,170 బస్సులకు ట్రాకింగ్‌ సదుపాయం అందించింది. కానీ సంస్థ ఆశించిన స్పందన రాకపోవడంతో ఆదాయం పెరగలేదు. దీనికి కారణం మొత్తం బస్సుల్లో సగానికి పైగా సాధారణ బస్సులే. పల్లెవెలుగు బస్సులు 3,107, సిటీ ఆర్డినరీ 1,569.. మొత్తం 4,676 సాధారణ బస్సులున్నాయి. ఈ బస్సులకు పరికరాలు అమర్చే ప్రక్రియ ప్రారంభమైంది. గమ్యం యాప్‌లో మహిళల భద్రతకు సంబంధించి ఫీచర్లు ఉండడం శుభపరిణామం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు