Wednesday, September 11, 2024
spot_img

ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌లో మంటలు

తప్పక చదవండి
  • మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌లే విలన్లు
  • మండిపడ్డ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి
  • వారి వల్లనే పార్టీ భ్రష్టు పట్టిందని వ్యాఖ్య
  • తన ఓటిమికి కారకులను వదిలేది లేదన్న శంకర్‌ నాయక్‌

వరంగల్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ అంతర్గ విద్వేషాలు భగ్గుమన్నాయి. తనను సొంతపార్టీ నేతలే కొందరు పనిగట్టుకుని ఓడిరచారని మహబూబాబాద్‌ మాజీ ఎమ్‌ఎల్యే శంకర్‌ నాయక్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇకపోతే మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ల కారణంగా జిల్లాలో బిఆర్‌ఎస్‌ భ్రష్టు పట్టిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్‌ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. శుక్రవారం తక్కళ్లపల్లి విూడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌ ఆత్మగౌరవం ఉన్న జిల్లా అని అన్నారు. ఎర్రబెల్లి, సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధ పడ్డారని తెలిపారు. తెలంగాణ వాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అని ప్రశ్నించారు. అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా వాస్తవాలు చెబుతారన్నారు. వాస్తవాలు చెప్పే వారు బయట, జోకుడు గాల్లు లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయని నిలదీశారు. ఖమ్మంలో ప్రతిసారి బయట గెలిచిన వారిని పార్టీలోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపోయారన్నారు. ఎర్రబెల్లిని మంచి లీడర్‌ అంటే ప్రజలు ఉరికించి కొడతారని వ్యాఖ్యానిం చారు. ఆయన వల్లనే జిల్లాలో పార్టీకి ఆదరణ లేకుండా పోయిందని అన్నారు. ఎర్రబెల్లి చక్కిలి గింతలు పెట్టడం తప్ప ఎవ్వరికీ రూపాయి సహాయం చేయరని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో తమ ఎమ్మేల్యేలు ప్రజలకు ఇరిటేషన్‌ పెంచారన్నారు. దానిని ఎలా మేనేజ్‌ చేయాలో పార్టీకి ప్లాన్‌ లేకపోతే ఎలా గెలుస్తామని అడిగారు. ఇకపోతే వరంగల్‌ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదని… కుక్కలు కూడా వారి వెంట పడవంటూ తక్కలపల్లి రవీందర్‌ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉండి ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా.. నాకు ఆల్రెడీ 55 సంవత్సరాలు క్రాస్‌ అయ్యాయి ఇంకా నన్ను ఏం చేస్తార్రబై.. ఒక్కొక్కడిని ఆట ఆడుకుంటా వేట మొదలైంది. కేసీఆర్‌ హాస్పిటల్‌లో ఉండి బుక్స్‌ చదువుతున్నాడు, భవిష్యత్తు ఎలా చెయ్యాలని… నేను, కేసీఆర్‌ ఒక్క కార్తెలోనే పుట్టాం బిడ్డ. కార్యకర్తలను కాపాడుకునే సత్తా నాకు పుష్కలంగా ఉంది. రాత్రి 12 గంటలకు ఆపద వచ్చిన ఫోన్‌ చేయండి వస్తా. నీకు ధైర్యం ఉంటే నా కార్యకర్తను ముట్టుకో, తర్వాత ఏమైతదో చూసుకో. ఇన్నిరోజులు ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే అలోచించాను, ఇప్పుడు మనల్ని ఆపేటోడు లేడు. ఒక్క అయ్య అవ్వకు పుట్టి ఉంటే, నేను చేసిన తప్పులను నిరూపించాలని నాపై ఆరోపణలు చేసిన వారికీ సవాల్‌ చేసిన కానీ ఎవ్వడు రాలే. మనం ఎవ్వరి జోలికి పోవొద్దు, మన జోలికి వస్తే వదిలిపెట్టొద్దు. కార్యకర్తకు ఆపద వస్తే మెరుపు వేగంతో వస్తా… విూకు అండగా నిలబడుతా‘ అంటూ శంకర్‌ నాయక్‌ కామెంట్స్‌ చేశారు. అయ్యప్ప మాలధారణలో ఉండి మరీ శంకర్‌ నాయక్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే శంకర్‌నాయక్‌ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన తన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు