Sunday, May 5, 2024

నామినేషన్ పత్రాల పరిశీలనలో పూర్తి అవగాహన ఉండాలి

తప్పక చదవండి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్

ఆదిలాబాద్ : నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. రిటర్నింగ్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన బోథ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి చాంబర్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్నికల నియమ నిబంధనల మేరకు నామినిషన్ పత్రాలను స్వీకరించాలని, ఫెసిలిటేషన్, నామినేషన్ పత్రాలు అందించే కౌంటర్ ఏర్పాటు చేయాలని, సిబ్బంది అందరు నామినేషన్ పత్రాల పరిశీలన పట్ల పూర్తి స్పష్టత, అవగాహనతో ఉండాలని సూచించారు. అనంతరం బోథ్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. బారికేడింగ్, సీసీ కెమెరాలు, వసతులు, బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి, పిఓ చాహత్ బాజ్ పాయ్, తహసీల్దార్ సుభాష్ చందర్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు