Wednesday, September 11, 2024
spot_img

రష్యాపై ఆంక్షలు ఈయూ చావుకొచ్చాయా?

తప్పక చదవండి

మాస్కో : ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను లొంగదీయాలని యురోపియన్‌ యూనియన్‌ ఇబ్బడి ముబ్బడిగా ఆంక్షలు విధించింది. కానీ చివరకు అవి తాము వేసిన ఉచ్చులో తామే చిక్కుకున్నట్టయింది. రష్యాపైన విధించిన ఆంక్షల ఫలితంగా యూరోపి యన్‌ యూనియన్‌ దేశాలు 1.5 ట్రిలియన్‌ డాలర్ల (ఒక లక్షా యాభై వేల కోట్లకు సమానం) సంప దను కోల్పోయినట్టు రష్యన్‌ ఉప విదేశాంగ మంత్రి అలెగ్జాండర్‌ గ్రుష్కో శుక్రవారం ప్రకటించారు. రష్యాపట్ల యూరోపియన్‌ యూనియన్‌ సవిూప భవిష్యత్తులోనూ తన విధానాలను మార్చుకునే సూచనలేవీ కనిపించటం లేదని యూరేసియన్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమావేశం సందర్భంగా పాత్రికే యులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2013లో యూరోపియన్‌ యూనియన్‌ సభ్యదేశాలు రష్యాతో జరిపిన వాణిజ్యం పరిమాణం 417 బిలియన్‌ డాలర్లు. ఉక్రెయిన్‌ సంబంధిత ఆంక్షలు లేనట్టయితే అది వర్తమాన సంవత్సరంలో కనీసం 700 బిలియన్‌ డాలర్లయి ఉండేది. కానీ 2022వ సంవత్సరంలో యూరోపియన్‌ యూనియన్‌కు, రష్యాకు మధ్య జరిగిన వాణిజ్యం పరిమాణం కేవలం 200 బిలియన్లు, ఇది 2023లో మరింతగా క్షీణించి 100బిలియన్ల కంటే దిగువకు పడిపోయే అవకాశం ఉంటుందని, వచ్చే సంవత్సరంకల్లా అది 50బిలియన్లకు, ఆ తరువాత అది సున్నాకు పతనమౌతుందని తాను భావిస్తున్నట్టు గ్రుష్కో చెప్పారు. అమెరికాలోని ధరకు మూడు రెట్లు ఎక్కువ చెల్లించి జర్మనీ పారిశ్రామిక రంగం గ్యాస్‌ను కొంటోంది. జర్మన్‌ పారిశ్రామికవేత్తలు హెచ్చరిస్తున్నా అనేక పరిశ్రమలు మెల్లమెల్లగా అమెరికాకు తరలివెళుతున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక జోక్యం తరువాత యూరోపియన్‌ యూనియన్‌ రష్యాపైన 11 ఆంక్షల ప్యాకేజీలను విధించింది. దీనితో వాణిజ్యానికి వేలకువేల ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ఇది రష్యాను నష్టపరిచిన దానికంటే ఎంతో ఎక్కువగా యూరోపియన్‌ యూనియన్‌ను నష్టపరిచాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు