Sunday, May 19, 2024

హిజ్బుల్లా చీఫ్‌ తొలిసారి బహిరంగ ప్రసంగం

తప్పక చదవండి

బీరుట్‌ : ఇజ్రాయెల్‌పై ‘పవిత్ర యుద్ధం’లో త్యాగాలకు సిద్ధమయ్యామని లెబనాన్‌లో మిలిటెంట్‌ గ్రూప్‌కు నేతృత్వం వహిస్తున్న హిజ్బుల్లా చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్రల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం మొదలై సుమారు నెల రోజులవుతున్న తరుణంలో శుక్రవారం ఆయన తొలిసారి బహిరంగంగా టీవీలో ప్రసంగించారు. అక్టోబర్‌ 7న ఇజ్రా యెల్‌పై హమాస్‌ అనూహ్య దాడిని ఆయన సమర్థించారు. హమాస్‌ ఆపరేషన్‌ అల్‌ అక్సా ప్లడ్‌ నిర్ణయం వంద శాతం పాలస్తీన్లదే అని తెలిపారు. పాలస్తీనా భూభాగం, పాలస్తీనా ప్రజల కోసమే హమాస్‌ యుద్ధమని అన్నారు. ప్రాంతీయ సమస్యతో దీనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాగా, అక్టోబర్‌ 7 నాటి హమాస్‌ దాడి ఇజ్రాయెల్‌లో భూకంపం సృష్టించిందని హిజ్బుల్లా చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్రల్లా అభివర్ణించారు. ‘హమాస్‌ నిర్ణయం సరైనది, తెలివైనది, ధైర్యంతో కూడు కున్నది, సరైన సమయంలో జరిగింది’ అని వ్యాఖ్యానించారు. హమాస్‌పై దాడి మొదలై నెలవు తున్నా ఇజ్రాయెల్‌ ఒక్క మిలిటరీ విజయాన్ని సాధించలేకపోయిందని విమర్శించారు. ఇజ్రాయెల్‌ చర్చల ద్వారా మాత్రమే బంధీలను తిరిగి పొందగలదని అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడు లు, పౌరుల మరణాలకు అమెరికా కారణమని ఆరోపించారు. నస్రల్లా టెలివిజన్‌ ప్రసంగాన్ని వినేందుకు లెబనాన్‌ ప్రజలు ఆసక్తి చూపారు. రాజధాని బీరూట్‌లోని ఒక చౌరస్తా వేలాది మందితో నిండిపోయింది. హిజ్బుల్లా చీఫ్‌ తొలి ప్రసంగం సందర్భంగా తుపాకీ కాల్పులు కూడా మారుమోగాయి. ఆయన ప్రసంగంతో హమాస్‌, ఇజ్రాయెల్‌ వార్‌ ప్రాంతీయంగా విస్తరించవచ్చని యుద్ధ నిఫుణులు అనుమానిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు