- గ్రూప్ హోసింగ్ కాన్సెప్ట్ పేరుతో సరికొత్త దుఖాణం..
- మరోమారు తన కుటిల మెదడుకు పదును పెట్టిన కుర్రా మల్లికార్జున్ రావు..
- పేరొందిన కేశినేని బిల్డర్స్ ను అడ్డుపెట్టుకుని ప్రీలాంచ్ మోసానికి యత్నం..
- రాజకీయ పలుకుబడిని వాడుకోవడానికి సరికొత్త ప్లాను..
- కోటాను కోట్లు వెనుకేసుకున్నా తీరని ధన దాహం..
- నిద్రబోతున్న ప్రభుత్వాలు, అధికారులు..
గ్రీన్ ఫార్మా, ఫార్మా వ్యాలీ, సొంతిల్లు లాంటి ఆకర్షణీయమైన పేర్లతో ముచ్చెర్ల ఫార్మా సిటీకి సమీపంలో గత మూడు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ దందా చేసి అమాయకులను మోసం చేసి, తప్పించుకుతున్నారు సమూహ ప్రాజెక్ట్స్ సీఎండీ కుర్రా మల్లికార్జున రావు వ్యవహారాన్ని ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే.. కాగా ఈ దందాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడా కంపెనీని వదిలేసి, మరొక కంపెనీ అయినటువంటి కేశినేని డెవలపర్స్ లో డైరెక్టర్ గా జాయిన్ అయిన మల్లికార్జున్ మరో కొత్త దందాకు తెరతీశాడు..
హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున మంచి డిమాండ్ ఉన్నటువంటి కె.పీ.హెచ్.బీ. కి దగ్గరలోని ప్రగతి నగర్ లో ప్రగతి నగర్ లేక్ సిటీ పేరుతో హై రైజ్ అపార్ట్మెంట్స్ పేరుతో మరో దుఖాణం తెరిచాడు.. ఈ కొత్త దుఖాణం పేరు గ్రూప్ హౌసింగ్ కాన్సెప్ట్.. కొత్త కొత్త పేర్లతో ప్రాజెక్టులు మొదలెట్టి, అమాయకులను నిట్టనిలువునా ముంచడం సదరు మల్లికార్జున్ కు వెన్నతో పెట్టిన విద్య.. కాగా గ్రూప్ హౌసింగ్ కాన్సెప్ట్ అనే ప్రాజెక్టు లో ఏడెకరాల భూమి వున్నదని చెబుతూ, ఈ భూమి యజమాని ఎక్స్ఎల్లా ప్రాపర్టీస్ కాగా దీనికి సంబంధించిన సేల్స్, మార్కెటింగ్ ఎం.కె.జీ.ఆర్. ఎస్టేట్ హోసింగ్ ఎల్.ఎల్.పీ. గా చూపుతూ.. బిల్డర్స్ అండ్ డెవలపర్స్ గా పేరు ప్రఖ్యాతులు కలిగిన కేశినేని డెవలపర్స్ గా ఉంచారు.. నిజానికి ఈ భూమికి యజమానులు ఎక్స్ ఎల్లా ప్రాపర్టీస్ వారు.. ఇక్కడ ఎం.కె.జీ.ఆర్. ఎస్టీస్ట్స్ హౌసింగ్ వారు సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తున్నారు విచిత్రం ఏమిటంటే దీనికి అధినేత సదరు మోసగాడు కుర్రా మల్లికార్జున్ కావడం.. ఇక కేశినేని డెవలపర్స్ వారు డెవలప్మెంట్ బాధ్యతలు స్వీకరించారని చెబుతున్నారు.. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే.. ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ కొన్నవారు ఏదైనా పొరబాటు జరిగితే వీరి ముగ్గురిలో ఎవరిని సంప్రదించాలి అన్నది ప్రశ్నార్థకం.. అయితే ఈ ప్రాజెక్ట్ లో 5 టవర్లు, ఒక్కొక్క టవర్ 33 ఫ్లోర్లతో, కన్ స్ట్రక్షన్ చేయబోతున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ.. తమకు అనుకూలమైన ఏజెంట్లను నియమించుకుని, ప్రీ లాంచ్ పేరుతో అమ్మేస్తున్నారు.. కాగా ఈ నిర్మాణాలకు ఎలాంటి సరైన అనుమతులు లేకపోవడం దురదృష్టం.. ఇంకో విషయం ఏమిటంటే వీరు చెబుతున్న ప్రాజెక్టు చేబడుతున్న ఏడెకరాల భూమి సర్వే నెంబర్ : 57 లో ఉన్నది.. కాగా ఈ భూమి ప్రగతి నగర్ చెరువుకు ఆనుకుని ఉన్నది.. ఈ భ్హోమి యావత్తు రాళ్లు రప్పలతో, నీటి ప్రవాహంలో ఉండటం గమనార్హం..రేపటి రోజున ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే బాధ్యత ఎవరు నిర్వహిస్తారు.. 33 ఫ్లోర్లతో నిర్మిస్తున్న ఈ హై రైజ్ అపార్టుమెంట్లకు చెరువు పక్కన ఏవిధంగా అనుమతులు జారీ అయ్యాయి అన్నది కూడా ప్రశ్నార్థకమే..
కాగా సదరు కుర్రా మల్లికార్జున రావు సమూహ ప్రాజెక్ట్స్ పేరుతో కోట్లరూపాయలు దండుకున్నాడు.. దీనిపై ఇప్పటికీ అతీ గతీ లేదు.. మరిప్పుడు ఇంతటి భారీ ప్రాజెక్టు ఏవిధంగా చేబడుతున్నాడు.. కేశినేని బిల్డర్స్ ని అడ్డం పెట్టుకుని ఈ హై రైజ్ ప్రాజెక్టు ను హై లెవల్ రాజకీయ పలుకుబడితో నడిపిస్తున్నాడా..? అన్నది తేలాల్సి ఉంది.. కేశినేని డెవలపర్స్ అధినేత రాజకీయ పరపతి గురించి అందరికీ తెలుసు.. కనుక దీనివెనకాల రాజకీయ కోణం దాగుందనేది పలువురి అనుమానం.. అసలు నిజాలు వెలుగు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అమాయకులు మోసపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.. కేశినేని డెవలపర్స్ కు సంబంధించి వంద ఎకరాల విల్లా ప్రాజెక్ట్, దుండిగల్ తో బాటు మరిన్ని ప్రీ లాంచ్ భాగోతాలు ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం అవినీతిపై అస్త్రం..