Monday, April 29, 2024

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అప్‌ డేటెడ్‌ హంటర్‌ 350 ఆవిష్కరణ

తప్పక చదవండి

ప్రముఖ టూ వీలర్స్‌ తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన ఎంట్రీ లెవెల్‌ మోటారు బైక్‌ ‘హంటర్‌ 350’ అప్‌డేట్‌ చేసింది. డీపర్‌ వేరియంట్‌ బైక్స్‌ ఆరెంజ్‌, గ్రీన్‌ కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. దీంతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 బైక్‌.. మూడు వేరియంట్లు, ఎనిమిది కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫ్యాక్టరీ బ్లాక్‌, డాపర్‌ ఆరెంజ్‌, డాపర్‌ గ్రీన్‌, డాపర్‌ వైట్‌, డాపర్‌ గ్రే, రెబెల్‌ బ్లాక్‌, రెబెల్‌ బ్లూ, రెబెల్‌ రెడ్‌ కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందీ బైక్‌. మోటారు సైకిల్‌ రైడిరగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ చేసుకోవడానికి వీలుగా యూఎస్బీ పోర్ట్‌ కనెక్టివిటీ ఉంటది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 బైక్‌ రెట్రో మోడల్‌ ధర రూ.1.50 లక్షల నుంచి మెట్రో రెబెల్‌ రేంజ్‌ రూ.1.74 లక్షలు పలుకుతుంది. న్యూ కలర్‌ వేరియంట్‌ బైక్‌ ధర రూ.1,69,656 (ఎక్స్‌ షోరూమ్‌) గా నిర్ణయించారు. భారత్‌ మార్కెట్లో టీవీఎస్‌ రొనిన్‌, హోండా సీబీ 350, జావా 42, యెజ్డీ రోడ్‌ స్టర్‌ మోటారు సైకిళ్లతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 బైక్‌ తల పడుతుంది. 350సీసీ సెగ్మెంట్‌లో మోస్ట్‌ కంపాక్ట్‌ బైక్‌ ఇది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మీటర్‌ మోటారు సైకిళ్లతో పోలిస్తే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 బైక్‌ ప్రీమియం, అగ్రెసివ్‌?గా ఉంటది. న్యూ డాపర్‌ ఓ వేరియంట్‌ ఇంజిన్‌ ట్యాంక్‌ డార్క్‌ ఆరెంజ్‌ కలర్‌లో వస్తుంది. డాపర్‌ జీ వేరియంట్‌ బైక్‌ ట్యాంక్‌ ‘బ్రిటిష్‌ గ్రీన్‌’ షేడ్‌, ఫ్లోరోసెంట్‌ కలర్‌ విత్‌ లోగో స్ట్రిప్‌తో రూపుదిద్దుకుంటుంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 బైక్‌ ఫ్యుయల్‌ ఇంజెక్షన్‌ టెక్నాలజీతోపాటు 349 సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ / ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ వస్తుంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మీటర్‌ 350, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ న్యూ క్లాసిక్‌ మోడల్‌ మోటారు సైకిళ్లలో ఈ ఇంజిన్‌ వినియోగించారు. ఈ ఇంజిన్‌ 6100 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 20.2 హెచ్పీ విద్యుత్‌ 4000 ఆర్పీఎం వద్ద 27 ఎన్‌ఎం టార్క్‌ వెలువరిస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌ బ్యాక్స్‌తో ఇంజిన్‌ ట్యూన్‌ చేశారు. ఈ బైక్‌ గరిష్టంగా గంటకు 114 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. రాయ ల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 బైక్‌ సర్క్యులర్‌ హెడ్‌ ల్యాంప్స్‌, ఫోర్క్‌ కవర్‌ జైటర్స్‌, ఆఫ్‌సెట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంటుంది. మీటర్‌ 350, స్క్రామ్‌ 411 మోటారు సైకిళ్లలో మాదిరి ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, మీటర్‌ 350లో మాదిరిగానే స్విచ్‌ గేర్‌, గ్రిప్‌ జత చేశారు. కంఫర్టబుల్‌ రైడిరగ్‌ కోసం ఫ్రంట్‌లో 41ఎంఎం టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, రేర్‌లో 6-స్టెప్‌ ప్రీ లోడెడ్‌ అడ్జస్టబుల్‌ ట్విన్‌ ఎమల్షన్‌ షాక్‌ అబ్జార్బర్‌ ఉంటాయి. ఫ్రంట్‌లో 300 ఎంఎం డిస్క్‌, రేర్‌లో 240 ఎంఎం డిస్క్‌ తోపాటు డ్యుయల్‌ చానెల్‌ ఏబీఎస్‌ సిస్టమ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఉంటుంది. బైక్‌ 13-లీటర్ల ఫ్యుయల్‌ ట్యాక్‌, సీట్‌ హైట్‌ 800 ఎంఎం, 17-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ కలిగి ఉంటది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు