Friday, May 17, 2024

రోహిత్‌ శర్మ బౌలింగ్‌ ప్రాక్టీస్‌..

తప్పక చదవండి

ప్రపంచకప్‌ 2023లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకపో తోంది. అరంగేంట్ర మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా ఘన విజయంతో అగుడు పెట్టింది. ఇక రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడిరచి, ఆ తర్వాత పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఇక నాలుగో మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ టీంతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే పూణే చేరుకున్న టీమిండియా.. తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. ఆటగాళ్లందరూ ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లో చెమటోడ్చుతున్నారు. ఈమేరకు బీసీసీఐ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా షాక్‌ అవుతున్నారు. అందుకు గల కారణం కూడా ఉంది. ఈ వీడియోలో రోహిత్‌ శర్మ మరో అవతారం ఎత్తాడు. ఇప్పటి వరకు రోహిత్‌ను బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో చూసిన వారంతా.. ఈ కొత్త అవతారం చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌లో భాగంగా బౌలింగ్‌ చేశాడు. తన ఆఫ్‌ స్పిన్‌తో జడేజాకు బౌలింగ్‌ చేశాడు. రోహిత్‌ బౌలింగ్‌లో జడేజా బ్యాటింగ్‌ చేయడం వీడియోలో చూడొచ్చు. ఈ మేరకు బీసీసీఐ వీడియో షేర్‌ చేస్తూ.. ఆఫ్‌ స్పిన్నర్‌ రోహిత్‌ శర్మకు హాయ్‌ చెప్పండి అంటూ క్యాప్షన్‌ అందించింది. ఈ వీడియో చూసిన వారంతా రోహిత్‌ బౌలింగ్‌పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. టీమిండియాకు మరో ఆల్‌ రౌండర్‌ దొరికాడని కొందరు కామెంట్స్‌ చేస్తుండగా.. మరో హర్దిక్‌ లోడ్‌ అవుతున్నాడంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి రోహిత్‌ను ఇలా చూడడం బాగుందంటూ అంతా చెబుతున్నారు. మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క ఓవరైనా రోహిత్‌ బౌలింగ్‌ చేయాలంటూ కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు