Friday, May 17, 2024

టైటిల్‌ వైపు తీసుకెళ్తున్న టీమ్‌ ఇండియా

తప్పక చదవండి
  • తుది జట్టు నుండి శార్దూల్‌, సిరాజ్‌ ఔట్‌
  • జట్టులోకి రానున్న మొహ్మద్‌ షమీ, అశ్విన్‌
  • బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్‌ సేన

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్న భారత్‌.. మరో సమరానికి సిద్ధమైంది. నేడు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రోహిత్‌ సేన తలపడనుంది. భారత్‌ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో టీమిండియాకు మరోసారి షాక్‌ ఇవ్వాలని బంగ్లా చూస్తోంది. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన శుభ్‌మాన్‌ గిల్‌.. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేయనున్నాడు. పాకిస్తాన్‌పై 16 పరుగులకే ఔట్‌ అయిన గిల్‌.. బంగ్లాదేశ్‌పై చెలరేగాలని టీమ్‌ మేనేజ్మెంట్‌ ఆశిస్తోంది. వరుస హాఫ్‌ సెంచరీలు చేసిన రోహిత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లోనే ఉన్నారు. ఇప్పటివరకు స్టార్‌ ఆల్‌రౌండర్‌లు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలకు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. పాండ్యా ఆస్ట్రేలియాపై 11 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. జడేజా ఇంకా బ్యాటింగ్‌ చేయలేదు. జట్టును ఆదుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. భారత్‌ బౌలింగ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. నాలుగు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడిన పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మొహ్మద్‌ సిరాజ్‌లలో ఒకరికి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్ను గాయంతో ఈ ఏడాది ఎక్కువగా మ్యాచ్‌లు ఆడని బుమ్రాను కొనసాగించి సిరాజ్‌కు రెస్ట్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. సిరాజ్‌ స్థానంలో సీనియర్‌ పేసర్‌ మొహ్మద్‌ షమీ జట్టులోకి వస్తాడు. ఇక ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో వెటరన్‌ స్పిన్నర్‌ ఆర్‌ అశ్విన్‌ ఆడే అవకాశం ఉంది. మరో స్పిన్నర్‌ గా కుల్దీప్‌ యాదవ్‌ ఆడనున్నాడు.
ప్రపంచకప్‌-2023లో టీమిండియా అద్భుత ఫామ్‌తో దూసుకపోతోంది. రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలో విజయం సాధించింది. ఈ విజయం ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ వంటి బలమైన జట్లపైనే రావడం కూడా జట్టులో ఆత్మ విశ్వాసం పెంచేలా చేసింది. టైటిల్‌ కోసం భారత జట్టు గట్టి పోటీదారుగా ఉంది. అంతేకాకుండా, టీమ్‌ ఇండియా వాదనను మరింత బలపరిచే, భారత అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచే కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు కూడా ఉన్నాయి. అసలే యాదృచ్చికంగా టీమ్‌ ఇండియాను టైటిల్‌ వైపు తీసుకెళ్తున్నది. ఈ యాదృచ్చికం రోహిత్‌ శర్మ సెంచరీ, సిక్స్‌కు సంబంధించినది. ఆఫ్ఘనిస్థాన్‌పై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 131 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. అతను 84 బంతుల్లో ఈ పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ 16 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఈ సమయంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా రోహిత్‌ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గేల్‌ 483 మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు కొట్టాడు. రోహిత్‌ 453 మ్యాచ్‌ల్లో దీనిని దాటాడు. రోహిత్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. 2019 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఇదే విధమైన ఫీట్‌ చేశాడు. జూన్‌ 18, 2019 న జరిగిన మ్యాచ్‌లో, మోర్గాన్‌ 71 బంతుల్లో 148 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్‌ ఆడాడు. 4 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరల్డ్‌ ఇంటర్నేషనల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఈ మోర్గాన్‌ పేరిట నమోదైంది. రోహిత్‌ రికార్డును బద్దలు కొట్టాడు. 2013లో ఆస్ట్రేలియాపై రోహిత్‌ 16 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. ప్రపంచ కప్‌-2023లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్‌ గేల్‌ రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టగా, మోర్గాన్‌ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సృష్టించాడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌, ఇంగ్లండ్‌కు మోర్గాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించడం యాదృచ్ఛికం. వీరిద్దరూ అఫ్గాన్‌ జట్టుపై కూడా సెంచరీలు సాధించారు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఆతిథ్య కెప్టెన్‌ రికార్డు సృష్టించడం యాదృచ్ఛికమే.టైటిల్‌ వైపు తీసుకెళ్తున్న టీమ్‌ ఇండియా

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు