Tuesday, October 15, 2024
spot_img

ప్రభుత్వ భూమి కబ్జాపై ఆర్డీవో చర్యలు తీసుకోవాలి..

తప్పక చదవండి
  • జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి..

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ లోని సర్వే నెంబర్‌ 100,101లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురవు తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే ఈవ్యవహారంపై తగు చర్యలు తీసుకోవాలని జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి రాజేంద్ర నగర్‌ ఆర్డీవోను కోరారు. ఈ భూమిపై సుప్రీంకోర్టులో స్టేటస్‌ కో ఉన్నా..కబ్జారాయుళ్లు ఈ ల్యాండ్‌ ను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఆర్డీవోకు ఫోన్‌,వాట్సాప్‌ ద్వారా 100,101 సర్వే నెంబర్‌లలో భారీ కబ్జాలకు సంబంధించిన వివరాలకు పంపినట్లు వెల్లడిరచారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. మియాపూర్‌లోని సర్వేనెంబర్‌ 100,101లోని ప్రభుత్వ భూమి కబ్జా అయ్యేందుకు స్థానిక తహశీల్‌ కార్యాలయ అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు ఆరోపించారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా.. అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో కబ్జాలపై ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు తీసుకోనందున పాత తహశీల్దార్‌ పై ఉన్నతాధికారులు యాక్షన్‌ తీసుకున్నప్పటికీ..పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా శేరిలింగంపల్లి తహశీల్దార్‌ కార్యాలయానికి ఇంఛార్జ్‌ గా ఉన్న రాజేంద్ర నగర్‌ ఆర్డీవో తక్షణమే కబ్జా వ్యవహారాలపై యాక్షన్‌ తీసుకోవాలని కోరినట్లు తెలిపారు….
రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు
శేరిలింగంపల్లి మండలంలో అనేక ప్రభుత్వ భూములు కబ్జా గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈభూ ములను స్థానిక రెవెన్యూ అధికారుల అండతో కబ్జారాయుళ్లు యధేచ్చగా కబ్జా పెడుతున్నట్లు సమాచారం. కబ్జారాయుళ్లు ఇచ్చిన పైకానికి ఆశపడి మండల తహశీల్‌ కార్యాలయ అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు పరాధీనానికి సహకరి స్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కొలువుదీరిన రేవంత్‌ రెడ్డి సర్కార్‌ శేరిలింగంపల్లి మండలంపై ప్రత్యేక నజర్‌ పెడితే కబ్జారాయుళ్ల అసలు రంగు బయటపడే అవకా శాలు మెండుగా కనిపిస్తున్నాయి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు