Saturday, May 18, 2024

ప్రజల ఆరోగ్యంతో జల్‌పల్లి మున్సిపల్‌ యంత్రాంగం చెలగాటం

తప్పక చదవండి

జల్‌పల్లి : జల్‌పల్లి పురపాలక సంఘం పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా వెలసిన కొన్ని వందల సంఖ్యలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు నిలువచేసే గోదాములు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వాటి నియంత్రణలో జల్‌ పల్లి మున్సిపల్‌ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది స్థానిక రాజకీయ నాయకులు, మున్సిపాలిటీ క్రింది స్థాయి సిబ్బందికి ప్రతి నెల వీరి వద్ద నుండి మామూళ్లు తీసుకోవడంతో వీరిపై ఎవరైనా ఫిర్యాదులు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో వీరి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. వీరు ఏకంగా ప్రజలు నివసించే బస్తీల మధ్య ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిలువ చేస్తుండడంతో వాటి వలన పర్యావరణానికి ముప్పు తోపాటు స్థానికంగా నివసించే ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.
జల్‌పల్లి మున్సిపల్‌ అధికారులపై నమ్మకం లేక ఆన్‌ లైన్‌లో ఫిర్యాదు స్థానిక బీజేపీ పార్టీ కార్యకర్త వి. రాజేందర్‌..
మురిగీ పోయిన ప్లాస్టిక్‌, ఆయిల్‌ సంచుల నిల్వల వల్ల మురుగునీరు నిలిచిపోవడంతో, దోమల స్వైర విహారంతో రోగాల బారిన పడుతున్నామని, దీనితోపాటు దుర్వాసన వస్తుండడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాంటి ప్లాస్టిక్‌ వల్ల క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిపై గతంలో చాల సార్లు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసిన తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే తప్ప జన నివాసాల మధ్య గోదాములు ఏర్పాటు చేస్తున్న వారి పట్ల ఎలాంటి కఠిన చర్యలు తీసుకోక పోవడంతో జల్‌ పల్లి మున్సిపాలిటీ అధికారులపై నమ్మకం లేక శ్రీకృష్ణ నగర్‌ ప్రాంతానికి చెందిన బీజేపీ పార్టీ కార్యకర్త వి. రాజేందర్‌ పౌర సేవా మానిటరింగ్‌ సెల్‌ (టీఎస్‌ సిడిఎంఏ)కు ఆన్‌ లైన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇతనికి ఫిర్యాదు సంఖ్య 593837 మంజూరు చేసారు. దీనిపై జల్‌పల్లి పురపాలక సంఘం కమిషనర్‌ గాని, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు