Saturday, April 27, 2024

పైసా పెకో.. బిల్ లేవో..

తప్పక చదవండి
  • పైసలిచ్చిన వారి బిల్లులు మాత్రమే పాసయ్యేవి
  • అడిగినకాడికి సమర్పించుకుంటేనే పైసలొచ్చేవి
  • లేదంటే ముప్పుతిప్పలే.. నానా కష్టాలే
  • ఇది గత సర్కార్ హయాంలో ఆర్థిక శాఖ పరిస్థితి
  • అప్పట్లో సూత్రదారిగా రామకృష్ణ రావు.. పాత్రదారులుగా పీఎస్ శ్రీహరి, మంగమ్మ, వినోద్, శ్యామ్
  • వేల కోట్లలో ప్రజాధనాన్ని లూటీ చేసిన మాయగాళ్లు
  • నూతన ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి
  • ట్రబుల్‌ షూటరే రాష్ట్ర ఖజానకు ట్రబుల్‌గా మారిండా..?

హైదరాబాద్ : బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎందెందు వెతికనా.. అందందు కలదు అవినీతి పరిస్థితి అన్న విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వశాఖ తీసుకున్నా.. ఏ హెచ్ వోడీ తీసుకున్న అంతా కర్షన్ మయమే. అప్పట్లో ఎవరిని కదిలించిన ముడుపులు ముట్టజెప్పాల్సిందే. పనులు కావాలన్నా.. ఫైళ్లు కదలాలన్నా..పైకం ఇచ్చిన సందర్భాలు పరిపాటి. సంబంధిత తాబేదార్లకు కోరిన మేరకు రొక్కం ముట్టజెబితేనే పనులు అయ్యేటివి. అందులోనూ ఆర్థిక శాఖ అయితే అప్పట్లో మామూళ్లకు అడ్డగా మారిపోయింది.

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పటికీ.. అందులో మాత్రం అవినీతి మాత్రం ఆగలేదు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు తన తాబేదార్ తో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో విచ్చలవిడిగా వ్యవహరించారు. ఆయన ఇచ్చిన అండతోనే స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పీఎస్ శ్రీహరి రెచ్చిపోయారు. ఇతగాడు ప్రతీ ఫైలుకు ఒక రేట్ కట్టి అందినకాడికి దండుకున్నారు. ప్రతీ బిల్లులోనూ పది శాతం వసూలు చేసి తన బాస్ లకు ఆయాచిత లబ్ధి చేకూర్చాడు. తన మాట వింటే పరిస్థితి ఒకలా.. లేదంటే మరోలా యవ్వారాన్ని నడిపించేశారు. ఈ రకంగా మన గౌరవ శ్రీహరి గారు ఉన్నది పీఎస్ పోస్టులోనే అయినా.. నిబంధనలకు పాతరేసి.. పైరవీల జాతరను కొనసాగించారు. మొత్తం ఆర్థిక వ్యవస్థను తన కనుసన్నల్లో పెట్టుకొని శ్రీహరితో పాటు మరో నలుగురు వందల కోట్లు వెనకేసుకున్నారు. వీరి ఆగడాలపై ఇక నుంచి ఆదాబ్ లో ప్రత్యేక కథనాలను ప్రచురించబోతున్నాం.

- Advertisement -

ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆయువు పట్టు. ఇది ముఖ్య శాఖ కావడంతో.. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలనుకున్న ఈ శాఖ అనుమతి తప్పనిసరి. అయితేే ఇంతటి కీలకమైన శాఖ జీతాలు, బిల్లుల చెల్లింపులు, జీపీఎఫ్ వంటి విషయాల్లో ఉన్నతస్థాయిలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు గతంలో ఎప్పుడు పెద్దగా వేలుపెట్టకపోయే వారు కాదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితులు మారిపోయాయి. పీఏఓ బిల్లుల చెల్లింపులు, జీతాలు, జీపీఎప్ వంటి వాటిలో కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆటోమాటిక్ గా బిల్ శాంక్షన్ అయ్యే పద్ధతిని తొలగించి.. కొత్త దందాకు తెర లేపారు. కాంట్రాక్టర్లు, ఎంప్లాయిస్ ను డిపార్ట్ మెంట్ చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకున్నారు. ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లో తెలంగాణ ఎంప్లాయిస్ కి సంబంధించి జీతాలు, ఈఎల్ ఎన్ క్యాష్ మెంట్, జీపీఎఫ్ విత్ డ్రా వంటి బిల్లులను డ్రాయింగ్ ఆఫీసర్ లాగిన్ నుంచి బిల్స్ చేయడం జరుగుతుంది. ఇలా వేసిన ప్రతీ బిల్లుకి ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ బిల్స్ ని సంబంధిత డిస్ట్రిక్ట్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ లో స్క్రూటి చేసి అంత క్లియర్ గా ఉంటే తర్వాత గవర్నమెంట్ కి పంపడం జరుగుతుంది. అప్పుడు ఈ బిల్ యొక్క స్టేటస్ అవెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని వస్తుంది.

ఇక్కడే అసలు కథ మొదలు

ప్రొసీజర్ ప్రకారం బిల్స్ క్లియర్ అవ్వాలి అంటే టోకెన్ నెంబర్స్ ని సీరియల్ వైస్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ, గత ప్రభుత్వ హయాంలో సెక్రటేరియట్ లో దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే బిల్స్ క్లియర్ చేయమని వాళ్ళ దగ్గరికి వెళ్లి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళవి మాత్రమే క్లియర్ చేస్తూ.. వెళ్లడం జరిగింది. ఫైనన్స్ డిపార్ట్మెంట్లో ఏ అధికారిని రిక్వెస్ట్ చేసిన వాళ్లు టోకెన్ నెంబర్లని ప్రయారిటి లిస్టులో పెట్టి స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు కి పంపేవారు. ఇలా ఏ బిల్లు క్లియర్ అవ్వాలి అన్న స్పెషల్ సీఎస్ క్లియరెన్స్ లేనిది జరిగేది కాదు. అయితే ఇలా రిక్వెస్ట్ రూపంలో వచ్చిన ఎక్కువ ఫైళ్లు పైరవీకారులవే కావడం గమనార్హం. పైరవీకారులకు సంబంధించిన ఫైళ్లనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోని కింగ్ మేకర్ శ్రీహరి రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారుల అండదండలతో ప్రతీ పనికి ఓ రేట్ మాట్లాడి పనులను పూర్తి చేసేవారు. తన మాట వినని వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేటోడు. ఇదే ప్రొసీజర్ ను కాంట్రాక్ట్ ల విషయంలో ఆయన కొనసాగించారు. పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించుకున్న వారికి తొందరగా బిల్స్ క్లియర్ చేయించేటోళ్లు. అదే టైంలో అన్ని రకాలుగా క్లియర్ గా బిల్లులు, ఇతరత్రా వ్యవహారాలకు ముడుపులు ముట్టజెప్పకపోతే పక్కనబెట్టేవారే విమర్శలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు