Friday, July 19, 2024

వాకాటి కరుణ మాయాజాలం

తప్పక చదవండి
 • కాంట్రాక్ట్‌ డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్‌లో గోల్‌మాల్‌
 • క్రమబద్దీకరణలో భారీ ఎత్తున ముడుపులు
 • 61 మంది డిగ్రీ లెక్చరర్ల పర్మినెంట్‌
 • ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు
 • ఫేక్‌ పీహెచ్‌డీ అభ్యర్థుల క్రమబద్దీకరణ
 • 47 మందివి నకిలీ డాక్టరేట్లే..!
 • పాత్రదారులుగా జేడీ, ఆర్జేడీలు
 • ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ సర్టిఫికేట్లలోనూ గోల్‌ మాల్‌
 • 67 మంది ఆన్‌-ఎయిడెడ్‌ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌..
 • పర్మినెంట్‌లోనూ చేతివాటం
 • మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను తుంగలో తొక్కిన వైనం
 • ఈ అవినీతి వెనుక నవీన్‌ మిట్టల్‌ పాత్ర..!

హైదరాబాద్‌ : ఉన్నత విద్యాశాఖలో గోల్‌మాల్‌ జరిగింది. కళ్లు బైర్లు కమ్మే అవినీతి బయటపడిరది. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల క్రమబద్దీకరణలో ఉన్నతస్థాయి అధికారులు తమ తాబేదార్లను అడ్డంపెట్టుకొని..అందినకాడికి దండుకొని ఆర్డర్స్‌ పాస్‌ చేసినట్లు తేలింది. ఒక్కో డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ నుంచి రూ.5 లక్షలు పుచ్చుకొని పోస్టింగ్స్‌ ఇచ్చేశారు. ఇందులో అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నుంచి కమిషనర్‌ వరకూ ముడుపులు ముట్టినట్లు సమాచారం. అప్పటి ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ వాకాటి కరుణ అండదండలతోనే ఈ తంతు జరిగినట్లు తెలుస్తోంది. ఆమె సపోర్ట్‌ తోనే జేడీ,ఆర్జేడీ స్థాయి అధికారులు రెచ్చిపోవడం గమనార్హం.

ఆర్డర్స్‌ వచ్చింది 12న..జాయిన్‌ అయింది 08న..!

- Advertisement -
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆర్డర్స్‌ వస్తేనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. కానీ,కాంట్రాక్ట్‌ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల క్రమబద్దీకరణ విషయంలో ఈ నిబంధనలను గాలికొదిలేసినట్లే కనిపిస్తోంది. తెలంగాణలో అక్టోబర్‌ 09న ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సర్కార్‌ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ రకమైన డిసిషన్స్‌ తీసుకున్నా.. ముందస్తుగా ఎన్నికల కమిషన్‌ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ,కాంట్రాక్ట్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పర్మినెంట్‌ విషయంలో ఉన్నత విద్యా శాఖ అతి పెద్ద తప్పిదానికి పాల్పడడం గమనార్హం. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను అస్సలు పట్టించుకోకుండా అప్పటి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ కాంట్రాక్ట్‌ డిగ్రీ కాలేజీల లెక్చరర్ల క్రబద్దీకరణకు సంబంధించిన జీవో ఎంఎస్‌ 80 తేది 7/10/2023ను జారీ చేయడం విస్మయం కల్గిస్తోంది. 

ఈ విషయంలో వాకాటి కరుణ పూర్తిగా నిబంధనలకు తిలోదకాలిచ్చేశారు. ఎన్నికల కోడ్‌ అక్టోబర్‌ 09న వస్తే పాత తేదీల్లో అనగా అదే నెల 07నే జీవో జారీ చేసినట్లు మాన్యువల్‌ గా సంతకం పెట్టేశారు. అంటే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత జీవో జారీ చేసినప్పటికీ..పాత తేదీలో జీవో జారీ కావడంతో కోడ్‌ ను ఎక్కడా ఉల్లంఘించనట్లు కలరింగ్‌ ఇచ్చారన్న మాట. మరోవైపు జీవో వచ్చిన తర్వాత అక్టోబర్‌ 11న 61 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో రాత్రి 11 గంటలకు ఉన్నత విద్యాశాఖ అధికారులు జాయినింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వడం గమనార్హం. అయితే అక్టోబర్‌ 11న జాయినింగ్‌ ఆర్డర్స్‌ పొందినట్లు తెలిస్తే..ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ 61 మంది 08వ తేదీనే విధుల్లో చేరినట్లు పాత తేదీతో ఇన్స్‌ వర్డ్స్‌ లో నమోదు చేయించుకున్నారు. వాస్తవానికి వీళ్లు 08,09,10 తేదీల్లో ఎక్కడా కూడా బయోమెట్రిక్‌ లో థంబ్‌ ఇంప్రెషన్‌ ను ఇవ్వలేదు. 

ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ సర్టిఫికేట్ల సబ్మిట్‌ లోనూ గోల్‌ మాల్‌..!
మరోవైపు కాంట్రాక్ట్‌ అధ్యాపకుల జాయినింగ్స్‌ సమయంలో సబ్మిట్‌ చేసిన ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ సర్టిఫికేట్లలోనూ గోల్‌ మాల్‌ యవ్వారానికి తెగబడినట్లు తేలింది. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన ప్రభుత్వ కొలువు పొందినప్పుడు ఆ సంబంధిత జాబ్‌ లో జాయిన్‌ అయ్యేటప్పుడు తప్పకుండా ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ సర్టిఫికేట్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ సర్టిఫికేట్ల సబ్మిషన్‌ లో కాంట్రాక్ట్‌ డిగ్రీ లెక్చరర్లు తేదీలను మార్చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన కన్న ముందటి 08వ తేదీని తప్పుగా నమోదు చేయించి సబ్మిట్‌ చేయడం గమనార్హం. వాస్తవానికి ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ సర్టిఫికేట్‌ ఇచ్చిన అసిస్టెంట్‌ సర్జర్స్‌ అక్టోబర్‌ 12వ తేదీనే వేసి సర్టిఫికేట్‌ ఇచ్చినప్పటికీ..దాన్ని వీళ్లే అక్టోబర్‌ 08గా దిద్దేయడం విస్మయం కల్గిస్తోంది. ఇలా మ్యానిపులేట్‌ చేసిన సర్టిఫికేట్లను ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్‌ సైతం యాక్సెప్ట్‌ చేయడం గమనార్హం.

ఫేక్‌ పీహెచ్డీలతో జాయినింగ్‌..!
ఇక కాంట్ష్రాక్ట్‌ అధ్యాపకులను క్రబద్దీకరించాలంటే పీహెచ్డీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ,61 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు రెగ్యులర్‌ అయితే అందులో సుమారు 47 మంది ఫేక్‌ పీహెచ్‌డీలతో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. ఇందుకోసం వారు నార్త్‌ ఇండియా నుంచి దొంగ పీహెచ్డీ పట్టాలను తీసుకొచ్చి సబ్మిట్‌ చేసినట్లు తెలుస్తోంది. వీటిని తరవుగా పరిశీలించకుండానే సంబంధిత అధికారులు ప్రోసిడిరగ్స్‌ ఇచ్చినట్లు అర్థమవుతోంది. 2019లో కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఉన్నత విద్యా శాఖ కార్యకలాపాల్లో బదిలీలు, ఇతరత్రా వ్యవహారాల కోసం ఈ ఆఫీసు వ్యవస్థనే వాడాలనే నిబంధనను తీసుకొచ్చారు. అందులో భాగంగానే 09-10-2023 రోజున సిటి కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్న డా.పి.బాలభాస్కర్‌ ను ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ కార్యాలయానికి ఏజీవో (అకడమిక్‌ గైడెన్స్‌ ఆఫీసర్‌)గా బాధ్యతలు ఇస్తూ.. డిజిటల్‌గా ఈ ఆఫీసు ద్వారానే ప్రోసిడిరగ్‌ ఇచ్చారు కూడా. అయిత్ఱే ఈ నిబంధనలను కాంట్రాక్ట్‌ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పర్మినెంట్‌ విషయంలో ఎందుకు పాటించలేదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

పోస్టుకు రూ.5లక్షలు వసూల్‌.. జేడీ, ఆర్జేడీలే పాత్రదారులు..!

ఉన్నత విద్యాశాఖ బాసులు ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కడమే కాదు..కాంట్రాక్ట్‌ అధ్యాపకుల నుంచి దండిగానే డబ్బులు దండుకున్నట్లు సమాచారం. ఒక్కో అభ్యర్థి నుంచి తక్కువలో తక్కువ రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకూ లాగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పాత కమిషనర్‌ నవీన్‌ అనుచరులు రంగం ప్రవేశ చేసినట్లు సమాచారం. వాకాటి కరుణ,నవీన్‌ మిట్టల్‌ ల సపోర్ట్‌ చూసుకొని జేడీ డా.రాజేందర్‌ సింగ్‌,ఆర్జేడీ డా.జి.యాదగిరిలే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించేయడం గమనార్హం. డబ్బులు ముట్టజెప్పిన వారికి ప్రోసిడిరగ్స్‌ అందించడంలో వీరిదే కీలక పాత్రని టాక్‌. అయితే ప్రోసిడిరగ్స్‌ ఇచ్చిన సందర్భంగా ఎక్కడా స్టాంప్స్‌ వేయకపోవడం గమనార్హం. అంతేకాక 61 మంది కాంట్రాక్ట్‌ డిగ్రీ లెక్చరర్స్‌ గా జాయిన్‌ కాగానే..ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి అప్పటికే రెగ్యులర్‌ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న డిగ్రీ అధ్యాపకులను బదిలీ చేయడం కొసమెరుపు. ఇది చాలదన్నట్లు 105 మంది గెస్ట్‌ లెక్చరర్స్‌ ను నియమిస్తూ..ఎన్నికల కోడ్‌ కు ముందే 04-11-2023న మల్టీజోన్‌-2 జేడీ డా.జి.యాదగిరి ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ విషయంలో పలువురు ఎన్నికల కమిషన్‌ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా..పట్టించుకోకపోవడం శోచనీయం.

ఆన్‌-ఎయిడెడ్‌ సిబ్బందీ పర్మినెంట్‌..!

నవ్వుపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు..చందకాంతయ్య మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ లో పనిచేస్తున్న 37 మంది టీచింగ్‌,30 మంది నాన్‌-టీచింగ్‌ ఆన్‌ ఎయిడెడ్‌ కాలేజ్‌ స్టాఫ్‌ పర్మినెంట్‌ కావడం గమనార్హం. ఎన్నికల కోడ్‌ అక్టోబర్‌ 09న రాగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వీరికి అదే రోజు ఉదయం 7 నుంచి 7.30గంటల మధ్యన ప్రోసిడిరగ్స్‌ ఇవ్వడం వింతగా ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులో వుండగానే… అంతేకాక వీరికెవ్వరికీ నెట్‌,స్లెట్‌,పీహెచ్డీలు లేకుండానే పర్మినెంట్‌ చేసేయడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రోసిడిరగ్స్‌ ను కూడా డిజిటల్‌ కీని ఉపయోగించకుండా ఇవ్వడం కొసమెరుపు.తిరిగి వారిని అదే కళాశాలకు అక్రమ ఓ డీ లు ఇవ్వడం కొసమెరుపు.ఇక ఇందుకు సంబంధించిన జీవో 73 జారీలోనూ అప్పటి ఉన్నత విద్యా శాఖ ముఖ కార్యదర్శి వాకాటి కరుణనే కీలక భూమిక పోషించడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు