Tuesday, April 30, 2024

ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన ప్రజ్ఞానానంద

తప్పక చదవండి

భారత చెస్‌ మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద 2024 టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ ఛాంపియన్‌ డిరగ్‌ లిరెన్‌ను ఓడిరచాడు. ఈ విజయంతో చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను అధిగమించాడు. అలాగే, ప్రజ్ఞానంద భారత్‌ టాప్‌ ర్యాంక్‌ చెస్‌ ప్లేయర్‌గా అవతరించాడు. జనవరి 16న నెదర్లాండ్స్‌లోని ఔఱjస aఅ ్గవవలో జరిగిన టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ పోటీ, ఆర్‌. ప్రజ్ఞానానంద తెలివైన ఎత్తుగడల ద్వారా దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ డిరగ్‌ లిరెన్‌ వ్యూహాలను ధీటుగా అడ్డుకున్న ప్రజ్ఞానానంద నాలుగో రౌండ్‌లో విజయం సాధించాడు. దీంతో ప్రపంచ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడిరచిన రెండో భారతీయుడిగా నిలిచాడు. గతంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈ ఘనత సాధించాడు. నాలుగో ర్యాంక్‌లో ఉన్న చైనాకు చెందిన లిరెన్‌పై విజయం సాధించడం ద్వారా ఆర్‌. ప్రజ్ఞానంద ఈ ఘనత సాధించారు. డిరగ్‌ లిరెన్‌పై ఈ చారిత్రాత్మక విజయంతో, ఆర్‌. ఫిడే ర్యాంకింగ్స్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు చెందిన విశ్వనాథన్‌ ఆనంద్‌ను ప్రజ్ఞానంద అధిగమిం చాడు. ఆనంద్‌ ప్రస్తుతం 2748 రేటింగ్‌తో 11వ స్థానంలో ఉండగా, ప్రజ్ఞానంద 2748.3 రేటింగ్‌తో పైకి ఎగబాకాడు. దీని ద్వారా, అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ ర్యాంకింగ్‌ జాబితాలో భారతదేశపు నంబర్‌ చెస్‌ ప్లేయర్‌ నంబర్‌ వన్‌ చెస్‌ ప్లేయర్‌గా నిలిచాడు. మాగ్నస్‌ కార్ల్‌సెన్‌ ఇప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. నార్వేజియన్‌ చెస్‌ స్టార్‌ మొత్తం 2830 రేటింగ్‌తో అగ్రస్థానాన్ని నిలబెట్టు కోగలిగాడు. 5 సంవత్సరాల వయస్సులో ఆడటం ప్రారంభించిన ప్రగ్నానంద, 2018లో 12 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడిగా, ప్రపంచంలోని రెండవ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాడు. అభిమన్యు మిశ్రా, సెర్గీ కర్జాకిన్‌, గుకేష్‌ డి, జావోఖిర్‌ సిందరోవ్‌ తర్వాత గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించిన ఐదవ-పిన్న వయస్కుడిగా నిలిచాడు. యాదృచ్ఛికంగా ప్రగ్నానంద సోరది ఆర్‌ వైశాలి కూడా గ్రాండ్‌మాస్టర్‌ కావడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు