Wednesday, September 11, 2024
spot_img

రాహుల్‌గాంధీ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు

తప్పక చదవండి
  • ఎవరో రాసిన స్క్రిప్టును చదువుతున్న రాహుల్‌
  • రేవంత్‌రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి
  • విభజన హామీలపై రాహుల్‌ ఎనాడైనా మాట్లాడారా..? : ఎంఎల్‌సి కవిత

నిజామాబాద్‌ : రాహుల్‌ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ చదువుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష కోట్ల లోపే ఉంటుందని, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌ ఎలా అంటారని ప్రశ్నించారు. ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డితో కలిసి విూడియాతో మాట్లాడారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో 365 రోజుల పాటు చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు. రైతులంటే కాంగ్రెస్‌ పార్టీకి చిన్నచూపని విమర్శించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. రేవంత్‌ రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. ఆయన రేవంత్‌ రెడ్డి కాదని, రేటెంత రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ శుష్క వాగ్ధానాలతో ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. విభజన హామీలపై కేంద్రాన్ని ఏనాటూ ప్రశ్నించలేదన్నారు. సింగరేణిని నాశనం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని, తాడిచర్ల లాంటి గనులను ప్రైవేటు పరం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. కేంద్రం కోల్‌ బ్లాకులను వేలం వేస్తుంటే కాంగ్రెస్‌ చోద్యం చూసిందన్నారు. కుటుంబ రాజకీయాల గురించి ప్రియాంక గాంధీ మాట్లాడటం పెద్ద జోక్‌ అంటూ విూడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మోతీలాల్‌ కొడుకు నెహ్రూ.. జవహర్‌లాల్‌ కూతురు ఇందిరా.. ఆమె కొడుకు రాజీవ్‌.. ఆయన కూతురు ప్రియాంక అని విమర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు