Thursday, May 2, 2024

బీజేపీితోనే సాధ్యం…

తప్పక చదవండి
  • కెేసీఆర్‌ ఇంటికి పోవడం ఖాయం
  • కేసీఆర్‌కు పేదలు ఉన్నారనే ఆలోచన లేదు
  • కేసీఆర్‌కు దావత్‌ల మీద, లిక్కర్‌ల మీద ప్రేమ వున్నది
  • 27 అమిత్‌ షా సభను విజయవంతం చేయండి
  • ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌
    ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. ఈనెల 27న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఖమ్మం రానున్న సందర్భంగా సర్దార్‌ పటేల్‌ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించిన అనంతరం హోటల్‌ శ్రీ శ్రీ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ ఇక ఇంటికి పోవడం ఖాయమని, అందుకు బీజేపీ అన్నీ సిద్ధం చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బు సంచులతో పని మొదలు పెట్టిందని, అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 27 న మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ మొదలవుతుందని, కేంద్ర హోం మినిస్టర్‌ అమిత్‌ షా వస్తున్నారని, ఆ రోజు జిల్లాకు చెందిన బడా నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని పేర్కొన్నారు.ఖమ్మం జిల్లా వ్యవసాయం లో అగ్రగామిగా ఉందని, అత్యంత గిరిజన నియోజకవర్గాలు ఉన్న జిల్లా కూడా ఖమ్మం జిల్లానే అన్నారు. గిరిజనులను భూమి నుండి దూరం చేస్తున్నారని, కాళ్లు పట్టుకొని ఈ భూమికి దూరం చేయొద్దని వేడుకున్నా కనికరం చూపడం లేదన్నారు. కేసీఆర్‌ కు పేదలు ఉన్నారనే ఆలోచన లేదని కేవలం కుటుంబం పాలన, ఆదాయం, పదవులు ఉంటే చాలని ఎద్దేవా చేశారు. ఆత్మ హత్య చేసుకున్న రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని, కానీ పక్క రాష్ట్రాలకు మాత్రం మన డబ్బులు పంచుతున్నాడుఅన్నారు. కౌలు రైతులకు కూడా బీజేపీ సరైన న్యాయం చేస్తుందని, రాష్ట్రంలో బీజేపీ అధికారం లోకి వస్తే కేసీఆర్‌ కుటుంబంను వదిలేది లేదన్నారు.కేసీఆర్‌ కు దావత్‌ ల మీద, లిక్కర్‌ ల మీద నమ్మకం ఉందని, ప్రజల సేవ మీద లేదన్నారు. ఇక్కడి మంత్రి పేరుకి కమ్యునిస్టు కుటుంబంలో పుట్టిన అని చెప్పుకుంటున్నాడు తప్ప కమ్యూనిస్టు గా ఎప్పుడయినా ఉన్నాడా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. 52 శాతం ఉన్న బీసీలు, 11 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా లేదన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, గరికపాటి మోహనరావు, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, బంగారు శృతి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి, ఉప్పల శారద, రుద్ర ప్రదీప్‌, నున్న రవికుమార్‌, వీరు గౌడు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు