Friday, May 17, 2024

మీ కోసమే… రాజకీయ బంధంతెంచుకోవాలనుకున్నా …

తప్పక చదవండి
  • గోదావరి నీళ్ళతో ఉమ్మడి జిల్లా ప్రజల కాళ్ళు కడిగే ఆ నిర్ణయం…
  • కొంతమంది శునకానందం పోయిండుతున్నారు…
  • అందుకే మళ్ళీ పోటీ చేస్తున్నా… మాజీ మంత్రి తుమ్మల…
  • అభిమానుల భారీ సంఫీుభావ ర్యాలీ…
  • వేలాది కార్లతో సరిహద్దు నుండి ఖమ్మం వరకు ప్రదర్శన…
    పాలేరు : మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా సీనియర్‌ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ది ప్రధాత తుమ్మల నాగేశ్వరరావు రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించారు.. ఇటీవల ప్రకటించిన టిఆర్‌ఎస్‌ అభ్యర్ధుల జాబితా లో తుమ్మల పేరు లేకపోవటంతో రెండు రోజులు అవమాన భారంతో ఉన్న తుమ్మల ఈ రోజు జిల్లాకు వచ్చారు.. ఇప్పటికే తుమ్మల ఆశించిన పాలేరు అభ్యర్ధిత్వాన్ని కేసిఆర్‌ తోసిపుచ్చటంతో రగిలి పోతున్న ఆయన అభిమానులు ఆయన కు భారీ సంఫీుభావ ర్యాలీని ఏర్పాటు చేశారు.. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌ గూడెం నుండి వేలాది కార్లతో తుమ్మలను జిల్లాకు ఆహ్వానించి మరీ భారీ ప్రదర్శన నిర్వహించారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజక వర్గాలతో పాటు, వాజేడు వెంకటాపురం ప్రాంతాల నుండి కూడా ప్రజలు తరలి వచ్చి తుమ్మల నాగేశ్వరరావుకు బాసటగా నిలిచారు.. మధ్యాహ్నం 2 గంటలకు తుమ్మల నాయకన్‌ గూడెం టోల్‌ గేటు వద్దకు చేరుకోగా, అభిమానులు, అనుచరులు ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆయన్ను ఓదార్చారు.. అనంతరం ర్యాలీగా బయలుదేరి పాలేరు, కూసుమంచి, జీళ్లచెర్వు, తల్లంపాడు, పొన్నెకల్‌, వరంగల్‌ క్రాస్‌ రోడ్స్‌ మీదుగా ఖమ్మం పట్టణం లోని తన ఇంటికి వెళ్ళారు.. అక్కడ ఆయనకు సంఫీు భావంగా వచ్చిన అనుచరులు, అభిమానులు తోపాటు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయంగా జిల్లాతో అనుబంధం తెంచుకో వాలనుకు న్నానన్నారు.. కాని మీ అందరి ఆదరాభి మానాలతో, గోదావరి జలాలను పాలేరుకు తెచ్చి మీ కాళ్ళు కడిగిన తరువాతే ఆ నిర్ణయం తీసుకోవాలనుకుంటానని తెలిపారు.. నా రాజకీయం ఎప్పుడూ నా కోసం కాదని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలతో ఉండాల నేదే నా ధ్యేయం అన్నారు… ఖమ్మం జిల్లాలో ఎందరో రాజకీయ ప్రముఖులకు రాని అవకాశాలు నాకు కల్పించి, మీకు సేవ చేసే అవలాశం కల్పించారు… ఎన్నోసార్లు నేను క్రింద పడ్డప్పుడల్లా నన్ను మేరే నిల బెట్టినందుకు మీకు పాదాభివందనం చేస్తున్నా.. నాకు పదవి నాకోసం కాదు, నన్ను నమ్మిన ప్రజలకోసమనే అన్నారు… ఎక్కడా ఎప్పుడూ మిమ్మల్ని తలవంచుకునేలా చేయ నన్ని మాటిచ్చారు.. నా రాజకీయ భవిష్యత్తు ను మీ చేతులలో పెడుతున్నానని ఉద్వేగభరితమయ్యారు.. మీరిచ్చిన ప్రతి అవకాశాన్ని నేనెంతో సద్వినియోగం చేశానని, ఉభయ రాష్ట్రాలలో ఎన్నో సాగునీటి ప్రాజ్జెక్టులను మీ స్పూర్తితోనే పూర్తిచేశానన్నారు.. నాకంటూ జిల్లా సమగ్రాభివృద్దే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.. అందుకే మళ్ళీ తాను శాసన సభ్యునిగా నిలబడి గెలుస్తానన్నారు… ఇంతటి అభిమానం నాపై చూపిస్తూన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు… కొంత మంది శునకానందం పొందుతున్నారు… అయినా మళ్ళీ మీ ముందుకోస్తున్నానని శపధం చేశారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు