Friday, May 17, 2024

హరితహారంలో నాటిన చెట్లను నరికిన ప్రభుత్వ ఉద్యోగి

తప్పక చదవండి
  • చెట్లను తొలగించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
  • తన పొలానికి కంచగా వేసుకున్న వైనం
  • పొంతన లేని సమాధానం చెబుతున్న అధికారులు..
    సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోట్ల రూపాయలతో ఒక ఉద్య మంలా నాటిన హరితహారం చెట్లను కొందరి వ్యక్తులు అకారణంగా నరికేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌ పహాడ్‌ మండల పరిధిలోని ధర్మపురం గ్రామపంచాయతీలో హరిత హారంలో నాటిన చెట్లను ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆంగోతు నాగేశ్వరావు హరితహారంలో నాటిన మొక్కలను జెసిబి సాయంతో పెగిలించగా మరికొన్ని చెట్ల కొమ్మలను నరికి వేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మపురం నుండి మేఘ్య తాండ వెళ్లే దారిలో హరితహారంలో 2015 – 2016 సం,,లంలో నాటిన చెట్లను మేఘ్య తండా కు చెందిన నాగేశ్వరావు అనే వ్యక్తి తన రోడ్డు వెంట ఉన్న పొలంలో చెట్ల నీడ పడుతుందన్న కారణంతో చెట్ల కొమ్మలను నరికివేగా శుక్రవారం పొలం దుండుతున్నగా ట్రాక్టర్‌ దిగబడిరది అన్న కారణంతో మరికొన్ని చెట్లను తొలగించినట్లు స్థానికులు చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాతావ రణం చూస్తే
    రోడ్డు వెంట చాలావరకు చెట్లను నరికి అతని పొలా నికి కంచగా వేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మండల పంచాయతీ అధికారులు మాత్రం అటు దిక్కుపోయి చూసింది కూడా లేదు, ఎంపీ ఓ రవి సంఘటన స్థలానికి వెళ్లి చూసినప్పటికీ రెండు చెట్ల మీద తొలగించినట్లు ఉందని చెప్తున్నారు.

అధికారుల పొంతన లేని సమాధానాలు… ధర్మపురం గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు వెంట నాటిన హరితహారం మొక్కలను తొలగించిన విషయమై గ్రామ కార్యదర్శి, ఏపీఓ, ఎంపిఓ, ఎంపీడీవో లను వివరణ కోరగా ఒకరికి ఒకరు పొంతన లేని సమాధానాలు చెప్తుండడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి..
గ్రామ కార్యదర్శి వివరణ : ధర్మపురం నుండి నుంచి మేఘ్య తండా వెళ్లే దారిలో ఆంగోతు నాగేశ్వరరావు వ్యవసాయ భూమి వద్ద రోడ్డు పక్కకు నాటిన హరితహారం లోని మొక్కలు పెద్దవి ఎనమిది చెట్లను మొదలుకు తొలగించి,చిన్న సైజు 18 చెట్ల కొమ్మలను నరికి, తన పొలానికి కంచగా వేసుకున్నాడని తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 16 పోలీస్‌ స్టేషన్లో నాగేశ్వరరావు పై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఎంపిఓ రవి వివరణ: పెన్‌ పహాడ్‌ మండలం ధర్మపురం శివారులో హరితహారంలో నాటిన మొక్కలను నాగేశ్వరావు అనే జెసిబి సాయంతో మొత్తానికే తొలగించాడని, నాగేశ్వరరావు ట్రాక్టర్‌ పొలంలో దిగబడితే జెసిబి సహాయంతో ట్రాక్టర్‌ ను బైటికి తీసే క్రమంలో, రెండు చెట్లును తొలగించారని గమనార్హం. చెట్లు నరికిన వ్యక్తికి ఈ అధికారి కొమ్ముకాస్తున్నాడని తెలుస్తుంది. కార్యదర్శి, ఎంపిఓ చెప్పిన సమాధానాలకి, ఏపీఓ చెప్పిన సమాధానామే ఆయన విచారణలో దాగిన నిజం అని చెప్పవచ్చు.
ఎంపిఓ నరేష్‌ వివరణ : ధర్మపురం గ్రామపంచాయతీ శివార్‌ లో హరితహారంలో నాటిన చెట్లను ఒక వ్యక్తి తన పొలంలో నీడ పడుతుందన్న కారణంతో నాలుగు చెట్లను నరికినట్లు తెలుస్తుందన్నారు. వాటిని నరికి తన పొలానికి కంచలాగా వేసుకున్నాడని కానీ అక్కడ చూస్తే చెట్లు చాలా ఎక్కువగానే నరికినట్లు తెలుస్తుందని తెలిపారు.ఎంపీ ఓ రవి ఫీల్డ్‌ కు వెళ్లారని, ఆయన విచారణ చేసి రిపోర్ట్‌ ఇస్తారన్నారు.
ఇలా అధికారులు పొంతనలేని సమాధానాలతో ఒకరు రెండు చెట్లు నరకాలని మరొకరు నాలుగు చెట్లు నరకాన్ని కానీ అక్కడ ఎక్కువగా ఉన్నాయని మరొకరు 10 నుంచి 18 చెట్ల పైననే నరికి వాటి కొమ్మలను నాగేశ్వరరావు తన పొలానికి కంచగా వేసుకున్నాడని కార్యదర్శి స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా, అధికారులు చెబుతున్న పొంతన లేని సమాధానంతో ప్రజలలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. చెట్లు తొలగించిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో అతనిపై కేసు నమోదు చేస్తారా.! లేదా సెటిల్మెంట్‌ చేసి నష్టపరిహారం కల్పించి, చెట్లు తొలగించిన ప్రాంతంలో మొక్కలు నాటిస్తారా అనేది వేచి చూడాల్సిందే…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు