Wednesday, May 8, 2024

యూపీ రాష్ట్ర ప్రజలకు యోగి దీపావళి కానుక..

తప్పక చదవండి
  • ‘ఉజ్వల యోజన’ పథకం కింద ఒక గ్యాస్‌ సిలిండర్‌ను
    ఉచితంగా అందజేస్తామని వెల్లడి
  • రూ. 632 కోట్ల అభివృద్ధి పనులకు యోగి శంఖుస్థాపన..

బులంద్‌షహర్‌ : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పారు. ‘ఉజ్వల యోజన’ పథకం కింద రాష్ట్రంలో గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారందరికీ దీపా పావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. బులంద్‌శహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిత్యనాథ్‌ ఈ మేరకు ప్రకటించారు. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు పొందిన వారిందరికీ సిలిండర్‌ ధరను రూ.300 మేర తగ్గిస్తూ కేంద్ర ప్ర భుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరో అడుగు ముందు కేసింది. రాష్ట్రంలోని ఉజ్వల యోజన లబ్దిదారులకు దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిం డర్‌ను ఉచితంగా అందిస్తాం. 2014లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్యాస్‌ కనెక్షన్‌ పొంద డం చాలా కష్టమైన పని. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల పథకం కింద రాష్ట్రంలో 1.75 కోట్ల మంది లబ్ది పొందారు‘ అని ఆదిత్యనాథ్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు