Monday, May 13, 2024

దసరా స్పెషల్ రాళ్లపై రైల్వే శాఖా కసరత్తు..

తప్పక చదవండి
  • ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటన..
  • నేటి నుంచి 24 తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో..
  • అన్ని కోచ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపిన అధికారులు..

హైదరాబాద్ : దసరాకు ప్రయాణికుల సౌకర్యార్థం ఏడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఈ రైళ్లు తెలుగు రాష్టాల్ర ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.19వ తేదీ: నర్సాపూర్‌`సికింద్రాబాద్‌ రైలు (నంబరు 07270) సాయంత్రం 6 గంటలకు, సికింద్రా బాద్‌ – తిరుపతి ప్రత్యేక రైలు (07041) 19న సాయంత్రం 8 గంటలకు బయల్దేరుతాయి. 20వ తేదీ: తిరుపతి – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07042) రాత్రి 7.50 గంటలకు, సికింద్రాబాద్‌ – కాకినాడ రైలు (07271) రాత్రి 9 గంటలకు బయల్దేరుతాయి.21వ తేదీ: కాకినాడ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07272) రాత్రి 8.10 గంటలకు బయల్దేరుతుంది. ఇక 23న సికింద్రాబాద్‌ – కాకినాడ ప్రత్యేక రైలు (07065) రాత్రి 7 గంటలకు.. 24న.. కాకినాడ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07066) రాత్రి 9 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైళ్లలో జనరల్‌, స్లీపర్‌, ఏసీ అన్ని తరగతుల కోచ్‌లు ఉంటాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు