Monday, April 29, 2024

ఆర్.టి.సి. క్రాస్ రోడ్డులో నిరుద్యోగ విద్యార్థిని ఆత్మహత్య ఘటన..

తప్పక చదవండి
  • దీనిపై ఆందోళన చేసిన ఏబీవీపీ నాయకుడు జీవన్ పై అక్రమ కేసు…

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం 10 ఏళ్లుగా వేచి చూసిన యువత  పేపర్ లీకేజీ, లోపభూయిష్టమైన  పరీక్షల నిర్వహణతో పరీక్షల రద్దు, నోటిఫికేషన్ విడుదలలో ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వంటి పలు అంశాలు నిరుద్యోగుల పాలిట శాపమై ఆత్మస్థైర్యం కోల్పోయి విధిలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఏబీవీపీ నాయకుడు  జీవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి ఘోర ఘటనలు జరుగుతున్నా నిరుద్యోగ అభ్యర్థి ఆత్మహత్యకు ఇతర కారణాలున్నాయని పోలీసులు, ఆత్మహత్యకు పాల్పడిన అభ్యర్థి అసలు పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న వారు కాదని ప్రభుత్వ పెద్దలు నిర్లజ్జగా తప్పుడు ప్రకటనలతో జూగుప్సకరంగా వ్యవహారిస్తున్నారు తప్ప, గ్రూప్ – 1 సహా ఇతర పరీక్షల లీకేజీ ఉదంతం, టి.ఎస్.పీ.ఎస్.సి.ని ప్రక్షాళన చేసి, పరీక్షలు నిర్వహించాలని చేసిన విద్యార్థి ఉద్యమాలను పెడ చెవిన పెట్టి అదే కమిషన్ సభ్యులతో గ్రూప్ – I మళ్ళీ నిర్వహించిన కారణంగా హైకోర్ట్ రద్దు చేయడం, ఎన్నికల కోడ్ ఉన్నందున పలు పరీక్షలు వాయిదా.. ఇవన్నీ తమ ప్రభుత్వ  తీవ్రమైన తప్పిదాల దరిమిలా జరుగుతున్న పరిణామాల పట్ల కనీస పశ్చాత్తాపం లేకుండా, బాధ్యతా రాహిత్యంగా, అమానవీయంగా వ్యవహరించడం నిరుద్యోగ అభ్యర్థుల వైపు నుండి వారి మనోభావాలు అర్ధం చేసుకోలేని మానసిక వైకల్యంలో ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం. 9 ఏళ్లుగా ఆక్రమ సంపాదనతో లక్షల కోట్లు వెనకేసి నేడు అన్ని స్థాయిల్లో నిజాలను మరుగున పెట్టి అహంకారంతో ప్రభుత్వ తప్పిదంతో విధిలేక ఆత్మహత్యకు పాల్పడ్డ వారిని వదలకుండా వారి కుటుంబ సభ్యులను మరింత మానసిక క్షోభకు గురి చేస్తూ.. ఆక్రమ డబ్బుతో నీచ రాజకీయాలతో ముందుకు వెళుతున్న బీ.ఆర్.ఎస్. పార్టీని భూస్థాపితం చేయడానికి తెలంగాణ ప్రజలు అందరూ కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారు.. విద్యార్థి లోకం, విద్యార్థి పరిషత్ ఈ రెండు నెలలు ఈ ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను, నిరుద్యోగ విద్యార్థుల జీవితాలను పదేళ్లుగా విద్యార్థుల జీవితాలను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే విధంగా ఇలా విద్యార్థుల, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కేసీఆర్ ప్రభుత్వం మనకు అవసరమా అని తెలంగాణ ప్రజానీకం భావిస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు