Monday, April 29, 2024

అక్రమ నిర్మాణాల‌ను ప్రోత్స‌హిస్తున్న ఎమ్మెల్యే

తప్పక చదవండి
  • ప్రభుత్వం మాది కాదు అక్రమ నిర్మాణాలను ఎలాగైనా కట్టుకోండి ః ఎమ్మెల్యే
  • ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిపై బొట్ల సాయిలు ఫైర్‌
  • జిహెచ్ఎంసి ఖజానాకు భారీ గండి ఎమ్మెల్యే.. అనుచరుల అక్రమ వసూళ్లు
  • అధికారుల తమ పని తాము చేసుకోకుండా అడ్డుపడుతూన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • అక్రమ నిర్మాణాలకు సహకరించండి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం
  • ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల సాయిలు

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో బహుళ అంతస్తులు, పెంట్ హౌస్లు, సెల్లార్లు, రోడ్ల కబ్జాలు ఎలాంటి నిర్మాణాలైనా కట్టుకోండి ప్రజలారా అధికారులు మీ వద్దకు రారు వస్తే నాకు తెలపండి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారని బొట్ల సాయిలు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణ దారులను ప్రోత్సహిస్తున్నాడని ఆయన అన్నారు. బహుళ అంతస్తులైన, సెల్లార్లైన, పెంట్ హౌస్ లైన నిర్మాణాలు యదేచ్చగా కట్టుకోనివ్వండి అధికా రులకు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. అక్రమ నిర్మాణాలపై అధికా రులు చర్యలు తీసుకుంటే నేను అధికారుల పై చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సహకరించమని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యవహార శైలి చూస్తేనే తెలుస్తుంది అని తెలిపారు. అధికార పార్టీకి ఆదాయం రాకుండా దురుద్దేశం పెట్టుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యే నిర్ణయాలు ఉన్నాయని ఆయన అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్న భ్రమలోనే ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం మునిసిపల్ చట్టం ప్రకారం అధికారులు నిర్ణయాలు తీసుకునేలా చూడాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇలాంటి ఎమ్మెల్యేల వ్యవహారాలు అధికారులు వినకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు