Tuesday, May 7, 2024

వల్లభనేని అనిల్ కుమార్ పట్ల తస్మాత్ జాగ్రత్త

తప్పక చదవండి
  • అధికార పార్టీలను కాకా పట్టడంలో ఆయన దిట్ట
  • అవసరం మేరకు రంగులు మార్చే ఊసరవెల్లి
  • చిత్రపురి కాలనీలో ఆయన అక్రమాలు అన్ని ఇన్ని కావు
  • మోసాలను కప్పిపుచ్చుకోవడానికే అవిశ్వాసానికి తెర
  • మున్సిపాలిటీని ముంచేసిన వల్లభనేని అనిల్ కుమార్!?
  • తన భార్యని మణికొండ మున్సిపల్ చైర్మన్ ని చేయాలని కోట్లు ఖర్చు పెట్టిన వల్లభనేని..

మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్స్ వెనుక మొత్తం కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చిత్రపురి ప్రస్తుత అధ్యక్షుడు, ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అయిన వల్లభనేని అనిల్ కుమార్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. దానికి ప్రధాన కారణం చిత్రపురి… చిత్రపురి అక్రమాల నుండి బయట పడాలంటే తన భార్య ఒకటో వార్డ్ కౌన్సిలర్ హైమాంజలి ని మణికొండ మున్సిపల్ చైర్మన్ ని చేసి, ఒక బలమైన పదవితో కాంగ్రెస్ పార్టీలో చేరి తద్వారా చిత్రపురి అక్రమాల నుండి బయటపడాలని లేదా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రక్షించబడాలని ఒక ఎత్తుగడ అని తెలిసింది.

గత ప్రభుత్వం హయాంలో అనేకమంది మంత్రివర్యులు, ఏమ్ ఎల్ ఏ లు, ఐఏఎస్ అధికారులు, కో ఆపరేటివ్ అధికారులు మొత్తం చిత్రపురి కమిటీ తో కలిసి కుమ్మక్కయి కోట్లు, ఫ్లాట్లు పొందారు. అప్పటి అధికారులు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయా పదవులలో కొనసాగుతూ కాంగ్రెస్ మంత్రివర్యులను కూడా ఎలక్టెడ్ బాడీ అండీ, మనం ఏమీ చేయలేము అంటూ ఏమార్చుతున్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే చిత్రపురి అధ్యక్షుడు వాళ్ళకి ఇంత ఆఫర్ చేశాను, వీళ్ళు అంత అడిగారు, మొత్తానికి కొంత ఫైనల్ చేశాను అంటూ మొత్తం చిత్రపురి టాం టాం చేసేశాడు.

- Advertisement -

దీనిలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ అధికారం కూడా మనకే వస్తే ఇంక తిరుగే లేదు అని భావించి ఒక పది మంది కౌన్సిలర్స్ ని ఒకటో వార్డ్ కౌన్సిలర్ తమతో నిత్యం తిప్పుకుంటూ… వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు కేవలం తన భార్య మున్సిపల్ చైర్మన్ అయ్యేందుకు చేతులు మార్చినట్లుగా తెలిసింది. ఈ చర్యలు గత పది నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా జరుతున్నాయి. అయితే మధ్యలో ప్రభుత్వం మారటం, చిత్రపురి అక్రమాల మీద ప్రస్తుత మంత్రివర్యులు కొందరు అగ్రహాంగా ఉండటంతో ఏమి చేయాలో వల్లభనేని అనిల్ కి దిక్కు తోచక ఈవిధంగా పదవి పొంది చిన్నగా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇంక అడ్డూ అదుపూ ఉండదని భావించి కేవలం ఆరు నెలల పదవీ కాలం కోసం మొత్తం డ్రామా మొదలెట్టినట్టుగా తెలిసింది. అందులో భాగమే కాంగ్రెస్ పార్టీ అధీణంలోని మణికొండ మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం కి మద్దతుగా వల్లభనేని హైమాంజలి కూడా మొదటివరసలో కాకుండా, చివరి వరసలో సంతకం చేయటం. సినీ ఫక్కీలో జరుగుతున్న ఈ డ్రామా మొత్తం చిత్రపురి అక్రమాలకు కేంద్ర భిందువు వల్లభనేని అనిల్ కుమార్ కావటం ఆశ్చర్యం. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్ష హోదాలో ఏ రాజకీయ పార్టీ కి కూడా మద్దతుగా ఉండకూడదు అనే బై లాస్ ని ధిక్కరించి, బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి అడ్డగోలుగా మద్దతుగా నిలబడి, తన కుల సంఘాలని సైతం గత ప్రభుత్వానికి మద్దతుగా ఉండేలా మందు పార్టీలు కూడా నిర్వహించిన ఘనత వల్లభనేని అనిల్ కుమార్ స్వంతం.

ఏది ఏమైనా ప్రస్తుతం తన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది ప్రభుత్వం మారటంతో… అయినా తన విధానం మార్చుకోకుండా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా లాబీయింగ్ లు మొదలు పెట్టినట్లుగా, అందులో విజయం సాధించినట్లుగా, కొందరు మంత్రివర్యులను తనకు మద్దతుగా, అండగా ఉంటాము అని చెప్పినట్లుగా… నువ్వు మూడు వందల కోట్లు తిన్నావంటాగా మా వాటా ఎంత?! అంటున్నారంటూ ఆయా మంత్రివర్యులు గురించి తనే ప్రచారం చేసుకోవటం విశేషం.

అదే సమయంలో వల్లభనేని కొందరి దగ్గరికి వెళ్లి చిత్రపురి అక్రమాలు అన్నీ గత కమిటీ చేసింది? నేను వాటిని అన్నీ సరిదిద్దుతున్నాను!!! కొందరు ఉద్యమాల పేరుతో పది ఫ్లాట్లు, లక్షల డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, నేను చాలా చాలా నిజాయితీ పరుడనని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని… అయినా ప్రస్తుత ప్రభుత్వంలో తనకి పట్టు దొరకటం లేదనే భాధతో చివరికి మణికొండ మున్సిపాలిటీకి తన భార్యని చైర్మన్ ని చేసి, కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరితే అనేక సమస్యల నుండి బయటపడవచ్చని చిత్రపురిలో అక్రమంగా సంపాదించిన సొమ్ము కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. అయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అవినీతి పరులను దగ్గరకు రానీయటం లేదని, అక్రమార్కుల పట్ల కఠినంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ చెప్పటంతో.. వల్లభనేని అనిల్ భవిష్యత్ చాలా అంధకారంలోకి వెళ్లిపోవచ్చు అని అందరూ అనుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు