Friday, May 3, 2024

మిషన్‌ గగన్‌యాన్‌

తప్పక చదవండి
  • క్రూ మాడ్యూల్‌ పరీక్షకు ఇస్రో సిద్ధం
  • మాడ్యూల్‌కు చెందిన ఫొటోలను విడుదల చేసిన ఇస్రో

బెంగుళూరు : అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం గగన్‌యాన్‌ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఆ ప్రాజెక్టులో కీలకమైన క్రూ మాడ్యూల్‌ పరీక్షకు ఇస్రో సిద్దమైంది. నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమగాములకు చెందిన క్రూ మాడ్యూల్‌ను ఇస్రో త్వరలో పరీక్షించనున్నది. గగన్‌యాన్‌ మిషన్‌కు చెందిన టెస్ట్‌ వెహికల్‌ అబోర్ట్‌ మిషన్‌1(టీవీడీ1) రూపుదిద్దుకున్నది. టీవీ`డీ1 మాడ్యూల్‌ను లాంచింగ్‌ కాంప్లెక్స్‌కు చేర్చారు. ఆ మాడ్యూల్‌కు చెందిన ఫోటోలను ఇస్రో తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. పీడనం లేనటువంటి క్రూ మాడ్యూల్‌ లోనే వ్యోమగాములు నింగిలోకి వెళ్తారు. అయితే ప్రస్తుతం టెస్టింగ్‌ కోసం ఆ మాడ్యూల్‌ను నింగిలోకి పంపి, మళ్లీ భూమిపై దించనున్నారు. ఈ పరీక్ష సమయంలో ఆ మాడ్యూల్‌ బంగాళాఖాతంలో ల్యాండ్‌ అవుతుంది. సముద్రం నుంచి ఇండియన్‌ నేవీ ఆ మాడ్యూల్‌ మెషన్‌ను తీసుకురానున్నట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. ‘గగన్‌యాన్‌ మిషన్‌ కోసం మానవరహిత విమాన పరీక్షలను ఇస్రో ప్రారంభించనుంది.. క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ పనితీరును ప్రదర్శించే ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి’ అని ట్వీట్‌ చేసింది. ‘ఈ టెస్ట్‌ ఫ్లైట్‌ విజయం భారతీయ వ్యోమగాములతో మొదటి గగన్‌యాన్‌ మిషన్‌కు అవసరమైన మిగిలిన అర్హత పరీక్షలు.. మానవరహిత మిషన్‌లకు వేదికను ఏర్పాటు చేస్తుంది’ అని పేర్కొంది. ‘టెస్ట్‌ వెహికల్‌ అనేది అబార్ట్‌ మిషన్‌ కోసం అభివృద్ధి చేసిన ఒకే-దశ లిక్విడ్‌ రాకెట్‌. పేలోడ్‌లలో క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌లు వేగవంతమైన సాలిడ్‌ మోటార్‌లతో పాటు క్రూ మాడ్యూల్‌ ఫెయిరింగ్‌,ఇంటర్‌ఫేస్‌ అడాప్టర్‌లు ఉంటాయి.. ఈ మాడ్యూల్‌ గగన్‌యాన్‌ మిషన్‌లో మ్యాక్‌ నంబర్‌ 1.2కి అనుగుణంగా ఆరోహణ క్రమంలో అబార్ట్‌ పరిస్థితిని అనుకరిస్తుంది’ అని ఇస్రో తెలిపింది. టీవీ-డీ1 మాడ్యూల్‌ నిర్మాణం తుది దశలో ఉందని, ఇది 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత.. అబార్ట్‌ సీక్వెన్స్‌లో భాగంగా మళ్లీ భూమి మీదకు వస్తుందని ఇస్రో వెల్లడిరచింది. పారాచూట్ల సాయంతో భూమిని చేరుతుందని పేర్కొంది. అనంతరం శ్రీహరికోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర ప్రాంతంలో ఆ మాడ్యూల్‌ ల్యాండ్‌కానున్నది. ప్రస్తుతం క్రూ మాడ్యూల్‌ను బెంగుళూరులోని ఇస్రో సెంటర్‌లో టెస్టింగ్‌ చేశారు. టెస్ట్‌ ఫ్లయిట్‌ సక్సెస్‌ అయిన తర్వాత గగన్‌యాన్‌ మిషన్‌ చేపట్టనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు