Sunday, October 13, 2024
spot_img

కుప్పకూలిన విమానం..

తప్పక చదవండి
  • ఇద్దరు ట్రైనీ ఫైలెట్ల దుర్మరణం

బ్రిటిష్‌ కొలంబియా: కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో ఓ తేలికపాటి విమానం కుప్పకూలింది. దీంతో భారత్‌కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలెట్లు సహా ముగ్గురు మరణించారు. పీఏ`34 సెనెకా అనే డబుల్‌ ఇంజిన్‌ లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వాంకోవర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లీవాక్‌ సమీపంలోని ఓ హోటల్‌ వద్ద కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడిరచారు. మృతుల్లో ఇద్దరు భారతీయ ట్రెయినీలు ఉన్నారని, వారిని అభయ్‌ గద్రూ, యష్‌ విజయ్‌ రాముగదేగా గుర్తించామన్నారు. వారు ముంబైకి చెందినవారని తెలిపారు. కాగా, ఆస్ట్రేలియాలోని క్వీన్‌ బెయాన్‌ పట్టణం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మరణించారు. కాన్‌బెర్రా నగరం నుంచి బయలుదేరిన విమానం క్వీన్‌ బెయాన్‌ పట్టణ సమీపంలో కూలిపోయింది. అనంతరం మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో విమానంలో ఉన్న పైలెట్‌తోపాటు ముగ్గురు పిల్లలు మరణించారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై ఏవియేషన్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు