Tuesday, May 7, 2024

మైనార్టీ గురుకులాల్లో కరప్షన్ కంపు

తప్పక చదవండి
  • టెండర్లలో భారీస్థాయి అవినీతి
  • బినామీ టెండర్లతో దోపిడీ
  • 2016 నుంచి యవ్వారం
  • రింగ్ మాస్టర్ గా లతీఫ్
  • ఆర్ఎల్సీలకు మెస్,హాస్టల్ బాధ్యతలు
  • దొంగ బిల్లులు,ఓచర్లతో అడ్డగోలు దోపిడీ
  • కేసీఆర్ బర్త్ డేకు బిల్లుల శాంక్షన్
  • అకడమిక్ హెడ్ గా లతీఫ్ వచ్చిన..
  • తర్వాత పరిస్థితి మరీ దారుణం
  • లతీఫ్ కు సెక్రెటరీ షఫీఉల్లా సపోర్ట్
  • ప్రైవేట్ కంపెనీతో ఆడిటింగ్
  • పడకేసిన విజిలెన్స్

హైదరాబాద్ : తెలంగాణ మైనార్టీ గురుకుల సోసైటీల్లో అవినీతి లీలలు తవ్వినకొద్ది వెలుగు చూస్తున్నాయి. కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మైనార్టీ గురుకులాలపై ఆదాబ్ ఓ కథనాన్ని ప్రచురించగా..దానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈనేపథ్యంలోనే మైనార్టీ గురుకుల సోసైటీల్లో జరుగుతున్న కరప్షన్ కంపుపై ఆదాబ్ మరింత సమచారాన్ని సేకరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలోని గురుకులాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తేలింది. మైనార్టీ రెసిడెన్షిల్స్ స్కూల్స్ స్టేట్ లెవెల్ టెండర్లు,గురుకులాల్లో భారీ అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ గురుకులాలు రన్ అవుతున్నాయి. వీటిలో ప్రతీ ఏటా లక్షలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

అయితేే ప్రతీ సంవత్సరం ఈ గురుకులాల్లో చదవే విద్యార్థులకు యూనిఫామ్స్,షూస్,స్పోర్ట్స్ ఐటెమ్స్,డెస్క్లు,కంప్యూటర్లు,సీసీ కెమెరాలు,కాస్మెటిక్ కిట్లను అందజేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో టెండర్లను ఆహ్వానించాల్సి ఉంటుంది. టెండర్లలో పాల్గొన్న సంస్థల్లో తక్కువ ధరలను కోడ్ చేసిన 3 సంస్థల్లో నుంచి అతి తక్కువ టెండర్ ధరను కోడ్ చేసిన దానికి బిడ్ దక్కుతుంది. దానికే మైనార్టీ గురుకుల సోసైటీల్లో విద్యార్థులకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే నిబంధనలు ఇలా ఉంటే..పైకి ఆ నిబంధనలను అమలు చేసినట్లే కనిపించినప్పటికీ అంతర్గతంగా మాత్రం బినామీల పేరుతో టెండర్ల యవ్వారం కొనసాగించడం గమనార్హం. అంతేకాక ఏకంగా మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫీఉల్లా అండతోనే మైనార్టీ అకడమిక్ హెడ్ లతీఫ్ రింగ్ మాస్టర్ గా వ్యవహరించి ఈ అవినీతి దందాలకు తెర లేపడం శోచనీయం.

- Advertisement -

ఆర్ఎల్సీల సిస్టమ్ వచ్చాకే తారాస్థాయికి అవినీతి

హాస్టల్,మెస్ వ్యవహారాలను 2018 వరకూ డిస్ట్రిక్ట్ మైనార్టీ వేల్పేర్ అధికారులే చూసుకునే వారు. కానీ రింగ్ మాస్టర్,అకడమిక్ హెడ్ లతీఫ్ చొరవతో మైనార్టీ గురుకులాల్లో ఆ పరిస్థితి మారిపోయింది. లతీఫ్ అకడమిక్ బాస్ హోదాలో గురుకులాల మెస్,హాస్టల్ బాధ్యతల నుంచి డీడబ్యూఓలను తప్పించి.. 2019లో వాటికి ఇంచార్జ్ లుగా ఆర్ఎల్సీలను అపాయింట్ చేశారు. వాస్తవానికి ఉమ్మడి జిల్లాల వారీగా ఆర్ఎల్సీలు గురుకులాల అకడమిక్ వ్యవహరాలను పర్యవేక్షించాలి. కానీ,వీళ్లకు హాస్టల్ వ్యవహారాలు చూసుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. కానీ,లతీఫ్ తీరుతో మైనార్టీ గురుకులాల్లో విచ్చల విడి అవినీతికి ఆస్కారం ఏర్పడింది.

ప్రైవేట్ సంస్థతో ఆడిటింగ్..!

మరోవైపు 2016 నుంచి మైనార్టీ గురుకులాల్లో ప్రభుత్వ ఆడిటింగ్ జరగలేదు. గురుకులాల ఆడిటింగ్ వ్యవహారాన్ని సోసైటీ బాస్ లు ఎన్జీ రావు అనే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థతో గురుకులాల కార్యదర్శి షఫీఉల్లాకు మధ్య మంచి అవగాహన ఉందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆడిటింగ్ ప్రక్రియ నామమాత్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా సోసైటీల్లో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ జరిగిన అక్రమాలు బయటకు రాకుండాపోయాయి. అంతేకాక ఎన్జీ రంగా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటికీ వరకు ఉన్నతాధికారులు ఒక్క రూపాయిని కూడా రికవరీ చేయకపోవడం గమనార్హం. వెరసి 2016 నుంచి ఇప్పటి వరకు మైనార్టీ గురుకులాల్లో వందల కోట్ల అవినీతి జరిగినా.. బయటకు రాకుండాపోయిందనే విమర్శలున్నాయి. వాస్తవానికి ఆడిటింగ్ సరిగ్గా చేసి ఉంటే కాంటిజెంట్ బిల్లు,సెలబ్రేషన్ బిల్లు,హాస్టల్స్ డైట్ బిల్లు,బోర్స్ కు సంబంధించిన బిల్స్,బిల్డింగ్ రెంట్స్ వంటి ఖర్చులకు సంబంధించిన విషయాల్లో జరిగిన అవకతవకలు మొత్తం బయటపడేవని సమాచారం.

విజిలెన్స్ అధికారులపైనే ఒత్తిళ్లు

ఇక మైనార్టీ గురుకులాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు అప్పట్లో విజిలెన్స్ విభాగం గుర్తించింది. బినామీ సంస్థలు రాష్ట్ర స్థాయి టెండర్లను దక్కించుకున్నట్లు తేల్చింది. అయితే ఈ వ్యవహారంలో పై స్థాయి నుంచి అప్పటి చీఫ్ విజిలెన్స్ అధికారి,ఇతర ఆఫీసర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలైపోయాయి. ఇక జిల్లాల వారీగా విజిలెన్స్ విభాగంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ ను అధికారులుగా నియమించడంతో గురుకులాల్లో జరిగిన అవినీతి బయటకు రాకుండాపోయినట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు