Friday, May 3, 2024

మరాఠా రిజర్వేషన్లకు ప్రభుత్వం అంగీకారం

తప్పక చదవండి
  • శాంతియుతంగా ఉండాలని అఖిలపక్షం పిలుపు
  • మహారాష్ట్ర రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వెల్లడి

మహారాష్ట్ర : మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుకూలమేనని ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వెల్లడిరచారు. ముంబయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయమై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని వివరించారు. ముంబయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయమై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని వివరించారు. మరాఠాలకు రిజర్వేషన్లు.. చట్టప్రకారం జరగాలని ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరగకుండా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. ప్రజలంతా శాంతియుతంగా మెలగాలని.. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలు, శాంతియుత ఆందోళనలకు చెడ్డపేరు తెస్తున్నాయన్న ఆయన.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. సామాన్యులు అభద్రతాభావం కలిగేలా వ్యవహరించవద్దని నిరసనకారులకు సూచించారు. ఈ సందర్భంగా కోటా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్త మనోజ్‌ జరంగే పాటిల్‌ తన దీక్షను విరమించాలని నేతలు ఓ తీర్మానం చేశారు. దానిపై సీఎం ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్‌?సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్‌ ఠాక్రే తరఫున హాజరైన అనిల్‌ పరాబ్‌లు సంతకాలు పెట్టారు. చట్టపరంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వానికి కొంచెం సమయం కావాలని, అంతవరకు మరాఠా సామాజికవర్గం నేతలు సంయమనం పాటించాలని శిందే కోరారు. ఈ విషయంపై జరంగే కూడా ప్రభుత్వానికి సహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో పాటు.. ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. కానీ, మరాఠా రిజర్వేషన్ల ఆవశ్యకత దృష్ట్యా తమ ఎమ్మెల్యేలు వెళ్లినట్లు ఆ వర్గం నేత సంజయ్‌ రౌత్‌ తెలిపారు. అంతకముందు మీడియాతో మాట్లాడిన మరాఠా ఉద్యమనేత జరంగే.. తమకు ప్రత్యేకంగా కోటా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేవలం కుంబీ కులంలో చేర్చితే సరిపోతుందని చెప్పారు. మరాఠాలు కుంబీ కులానికి చెందిన వారని.. ఆ కులం ఓబీసీ కేటగిరీ కిందకి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరాఠా సామాజిక వర్గ ప్రజలకు అధికారులు కొత్తగా కుంబీ కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారు ఓబీసీ ప్రయోజనాలు పొందే అవకాశం లభించినట్లయింది. మరోవైపు మరాఠా కోటా ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాలు సహా మున్సిపల్‌? భవనానికి నిప్పంటించిన నేపథ్యంలో బీడ్‌లో కర్ఫ్యూ విధించారు. ఇప్పటి వరకు 141 కేసులు నమోదు చేశామని.. 168 మందిని అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ రజనీశ్‌ సేథ్‌ తెలిపారు. సుమారు రూ.12కోట్ల ఆస్తులు ధ్వంసం చేసినట్లు వివరించారు. బీడ్‌ జిల్లాలో జరిగిన ఘటనలపై 20 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు