Friday, May 3, 2024

జోకర్ మల్లారెడ్డి మరోసారి బకరా అయిండా

తప్పక చదవండి
  • ఎన్నికల అఫ్ డవిట్ తప్పుల తడక
  • కనీస అవగాహన లేనివాడు మంత్రి ఎలా అయిండు
  • 70,80 వేల పుస్తకాలు చదివిన విద్యావేత్తకైన తెలువదా
  • డబ్బులకు సీట్లు అమ్ముకునే వాళ్లకి తెలిసింది ఒకటే
  • ఇలాంటివారా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది
  • రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన స్థానిక ఓటర్ కందాడి అంజిరెడ్డి
  • తప్పుడు సమాచారం ఇచ్చిన మల్లారెడ్డినిఅనహు రుడుగా ప్రకటించాలని డిమాండ్

హైదరాబాద్ : ప్రజా సేవ చేసే వ్యక్తి ప్రజాస్వామ్యంలో నీతి, నిజాయితీ గా ఉండాల్సిన వ్యక్తి తప్పుడు ధ్రువ పత్రాలతో మోసం చేయడమేంటని ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ఇలాంటి వారిపై విచారణ జరిపి అనహురుడు గా ప్రకటించాలని రాంపల్లి దయారా గ్రామ నివాసి స్థానిక ఓటర్ కందాడి అంజిరెడ్డి సోమవారం మేడ్చల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రజలు అనుకుంటున్నారు.

మల్లారెడ్డి సమర్పించిన ఎన్నికల ఆఫ్ డవిట్ తప్పుల తడక
2014 ఆయన సమర్పించిన ఆఫ్ డవిట్ లో తాను తన ఇంటర్ విద్యాభ్యాసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్యాట్నీ లో 1973లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. తిరిగి 2018 ఎన్నికల్లో భాగంగా సమర్పించిన అఫ్ డవిట్ లో తన ఇంటర్ విద్యభాసం వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్ లో 1973లో పూర్తి చేసినట్లు తెలిపారు అలాగే 2023 ఎన్నికలకు వచ్చేసరికి తన ఇంటర్ విద్యాభ్యాసం రాఘవ లక్ష్మి దేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973లో పూర్తి చేసినట్లు వివరించారు. 2014 ఎంపీగా పోటీ చేసిన సమయంలో తన వయసు 56 సంవత్సరాలుగా పేర్కొన్న మల్లారెడ్డి 2023 అఫిడవిట్లో 70 సంవత్సరాలుగా తెలిపారు. దీన్నిబట్టి ఆయన తొమ్మిది సంవత్సరాల్లోనే 15 సంవత్సరాల వయసు పెరగడం అద్భుతమని ఇలాంటి మైమల కూడా ఉన్నాయా! అవేంటో ప్రజలకు తెలపాలని ఆయన ఎద్దేవా చేశారు. ఒకే సంవత్సరంలో మూడు కాలేజీల్లో చదివిన ఘనత ఆయనకే దక్కిందని ఇలాంటి అద్భుతాలు చేసే మల్లారెడ్డి ప్రజా ప్రతినిధిగా కాకుండా దైవంశ సంభూతుడుగా ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు.

- Advertisement -

మేడ్చల్ ప్రజలను ఆశ్చర్యపరిచిన మంత్రి మల్లారెడ్డి
కనీస అవగాహన లేనివాడు మంత్రి ఎలా అయిండు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ప్రజలు మేడ్చల్ ప్రజలు మనకు అద్భుతాలు సృష్టించే ఎమ్మెల్యే ఉన్నందుకు మనం గర్వపడాలో బాధపడాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి గొప్ప మేధావినా మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది అంటూ తమను తామే నిందించుకుంటున్నారు. ఏదేమైనా జోకర్ మల్లారెడ్డి పేరును మాత్రం సార్ధకం చేసుకుంటున్నాడు తాను బకరా కావడమే కాకుండా మేడ్చల్ ప్రజలను కూడా బకరాలను చేస్తున్నాడు.

70నుండి 80 వేల పుస్తకాలు చదివిన మేధావులకు తెలియదా
డబ్బులకు టికెట్లు అమ్ముకునే వారు ఇలాంటివారిని ప్రోత్సహిస్తున్నారని ప్రజలు బహిరంగగానే బిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. తమ పార్టీకి డబ్బున్నోడు కావాలి, పోటీ చేసే అభ్యర్థులు చదువు ఉందా సంస్కారం ఉందా అనేది మాకు అనవసరం వారి దగ్గర డబ్బు ఉంటే చాలు వారే మా అభ్యర్థులు, డబ్బు ఉన్నోడు కాకుండా సంస్కారవంతులకు టికెట్లు ఇస్తే బాగుంటుందని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

తప్పుడు సమాచారం ఇచ్చిన మల్లారెడ్డిని అనహ్రూడి గా ప్రకటించాలని
తన ఎన్నికల ఆఫ్ డవిట్ లో పలుమార్లు తప్పుడు సమాచారం ఇచ్చి అటు అధికారులను ఇటు ప్రజలను పదేళ్లుగా మోసం చేస్తున్న చామకూర మల్లారెడ్డిని అనహృడిగా ప్రకటించి మేడ్చల్ ప్రజలకు న్యాయం చేయాలని రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు